ఒకప్పుడు స్టార్ బ్యూటీ పూనామ్ కౌర్ కు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఈ అమ్మడు సినిమాలకు దూరంగా ఉన్నా.. ఎప్పటికప్పుడు నెటింట సంచలన ట్విట్ చేస్తూ వైరల్ అవుతూనే ఉంటుంది. ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల గురించి వివాదాస్పద ట్విట్, కామెంట్స్ చేస్తూ ట్రెండింగ్ లో నిలుస్తుంది. కాంట్రవర్షియల్ బ్యూటీగా ఇమేజ్‌ని సంపాదించుకుంది. ఈ క్రమంలోనే తాజాగా అమ్మడు మరో సంచలన పోస్ట్ షేర్ చేసుకుంది. ఓ డైరెక్టర్ ఆ అమ్మాయిని అవకాశాలు ఇస్తానని మోసం చేసి ప్రెగ్నెంట్‌ని చేశాడంటూ పూనమ్ కౌర్ వెల్లడించింది. అతని వల్ల పంజాబీ నటి కెరీర్ నాశనం అయిపోయిందంటూ.. తన ట్విట్టర్ వేదికగా షేర్ చేసుకుంది.
మా సంస్థ జోక్యంతో ఆమెకు కాస్త సహాయం దొరికింది అంటూ వెల్లడించింది. అతడు పొలిటిషన్ గా మారిన నటుడు కాదు.. అతను దర్శకుడు.. ఆ విషయంలో నాతో పాటు మరో నటుడిని రాజకీయాల్లోకి అనవసరంగా లాగారు అంటూ పూనామ్ కౌర్ వెల్లడించింది. అయితే ఎవరి పేరును కూడా ఆమె ప్రస్తావించకపోవడం గమనర్హం. దీంతో ఇప్పుడు పూనమ్ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారుతుంది. ఆ పంజాబీ అమ్మాయి ఎవరు.. ఆమెని గర్భవతి చేసిన ఆ స్టార్ డైరెక్టర్ ఎవరు.. అనే ప్రశ్నలు మొదలయ్యాయి. పైగా మాకోసం ట్విట్‌లో పూనమ్ ప్రస్తావించడంతో.. ఆ వ్యక్తి టాలీవుడ్‌కు చెందిన డైరెక్టర్ అంటూ పలువురు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
కొద్ది రోజుల క్రితం పూనమ్ కౌర్.. డైరెక్టర్ త్రివిక్రమ్ పై మా అసోసియేషన్‌లో ఫిర్యాదు చేశానని వెల్లడించింది. కానీ.. తనతో పాటు చాలామందికి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేకపోవడంతో తన ఫిర్యాదును తిరస్కరించారని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే పూనమ్ కౌర్ త్రివిక్రమ్ గురించి అ పోస్ట్ పెట్టిందేమో అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే పంజాబ్‌కు చెందిన పూనమ్.. మాయజాలం మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తర్వాత విచిత్రం, సౌర్యం, నిక్కీ అండ్ నీరజ్, శ్రీనివాస కళ్యాణం, నెక్స్ట్ ఏంటి, గగనం ఇలా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. టాలీవుడ్‌లో చివరిగా నాతిచరామి సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. అయితే ఈ సినిమా ఊహించిన సక్సెస్ అందుకోలేదు.
clarification –
it’s not the actor turned politician who impregnated n aborted the girl which ended her career – it’s the director who did it -maa involvement helped the half punjabi actor , I and actor/politician were pulled unnecessarily due political desperation #punjabigirl.— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) October 9, 2024