సౌత్ ఇండియాలో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో మొదటి వరుసలో నాయనతార ఉంది. నాలుగుపదుల వయస్సులోను కోట్లల్లో ఛార్జ్ చేస్తూ ఫుల్ క్రేజ్‌తో దూసుకుపోతున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా గడుపుతుంది. కేవలం సౌత్‌లోనే కాదు.. బాలీవుడ్‌లోను జవాన్ సినిమాతో అడుగుపెట్టింది. షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాల్లో.. అమ్మడు హీరోయిన్గా నటించి మెప్పించింది. అయితే ఇప్పటివరకు నయనతార ఎన్నో సినిమాల్లో నటించి బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకున్నా.. తనతో సినిమాలు తెరకెక్కించిన పలువురు దర్శక, నిర్మాతలకు కొన్ని కంప్లైంట్స్ కూడా ఉన్నాయి.
ఆమె పట్ల నిర్మాతలు చాలామంది కోపంతో ఉన్నారట. కానీ ఆమెకు ఉన్న క్రేజ్ రీత్యా.. కోట్లు కుమ్మరించి సినిమాలో అవకాశాలు ఇస్తున్నారట. ఇక అత్యధికమైన రెమ్యునరేషన్‌ను డిమాండ్ చేస్తున్న నయన్.. అది చాలాదన్నట్లు షూటింగ్‌కి తనతో పాటు పదిమంది సిబ్బందిని తీసుకువస్తుందట. వాళ్లందరి ఖర్చులు కూడా నిర్మాతనే భరించాల్సి వస్తుంది. ఇంత చేసినా కూడా ప్రమోషన్స్ కి హాజరవుతుందా.. లేదా.. అనేది ఆమె ఇష్టమట. నయన్ ఎలాంటి ప్రమోషన్ ఈవెంట్ కి హాజరుకానాన్ని మొదటే కండిషన్‌లు పెట్టేస్తోంది. ఇప్పుడు ఇది చాలదన్నట్లు నిర్మాతలపై మరో కొత్త భారాన్ని వేసేస్తుందట.
ఈ విషయంపై తమిళ్ ప్రొడ్యూసర్ యూట్యూబర్ అయినా అనంతన్ మాట్లాడుతూ నయంతార పై ఫైర్ అయ్యారు. అనంతన్ నయనతార, విగ్నేష్ దంపతులకు ట్విన్స్ సంతానం. నయనతార పాటు పిల్లలు కూడా షూటింగ్‌లోకేషన్ కి వస్తారు. వీళ్ళ ఆలన పాలన చూసేందుకు ఇద్దరు ఆయాలని ఉంచుకుంది. ఇద్దరి ఆయాల ఖర్చు కూడా షూటింగ్ జరుగుతున్నన్ని రోజులు నిర్మాతలదే అని.. మొదట నయన్ కండిషన్ పెట్టేస్తుందట. ఇది చాలా దారుణం అంటూ అనంతన్ వెల్లడించాడు. పిల్లలను అడ్డుపెట్టుకుని కూడా నయన్ డబ్బులు సంపాదించడం ఏంటి అంటూ ఫైర్ అయ్యారు. ప్రస్తుతం కోలీవుడ్ మీడియాలో ఆనంతన్ చేసిన కామెంట్స్ వివాదంగా మారాయి.