‘ గేమ్ ఛేంజర్ ‘ నుంచి ఫాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. రెండు గుడ్ న్యూస్‌లు కూడా..

టాలీవుడ్ మేక పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా.. కియారా అద్వాని హీరోయిన్లుగా నటిస్తున్న మూవీ గేమ్ ఛేంజ‌ర్‌. మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సంచలన‌ ప్రాజెక్టు కోసం.. అభిమానులంతా అవైటెడ్‌గా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి మేకర్స్ అప్డేట్స్ ఇస్తున్న క్రమంలో.. దసరా కానుకగా సినిమా నుంచి టీజర్ రిలీజ్ అవుతుంది అంటూ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ.. ఇప్పుడు గేమ్ ఛేంజర్ టీజర్ మాత్రం రావడం లేదంటూ మ్యూజిక్ డైరెక్టర్ థ‌మన్ క్లారిటీ ఇచ్చేసాడు.

దీంతో టీజర్ దసరాకు రావడం లేదన్న వార్త వైరల్ గా మారింది. ఈ క్రమంలో మెగా అభిమానులంతా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు వస్తున్న పెద్ద సినిమాలన్నింటిలో కనీసం టీజర్ కూడా అప్డేట్ ఇవ్వని సినిమా గేమ్ ఛేంజ‌ర్‌ మాత్రమే. ఈ క్రమంలో దసరా కానుకగా అయినా టీజర్ రిలీజ్ చేస్తారని అభిమానులు భావించారు. కానీ.. ఇప్పుడు అది కూడా రావడం లేదని థ‌మన్ క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. టీజర్‌కి ఇంకా సిజ్‌ వర్క్, డబ్బింగ్, ఫైనల్ ఎడిటింగ్ పనులు జరుగుతున్నాయని.. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆల్ రెడీ ప్రారంభించామని ఆయన వెల్లడించాడు. అయితే ఈ బ్యాడ్ న్యూస్ తో పాటే థ‌మన్ మరో రెండు గుడ్ న్యూస్లను కూడా అభిమానులతో షేర్ చేసుకున్నాడు.

𝑴𝒆𝒈𝒂 𝒑𝒐𝒘𝒆𝒓 𝒔𝒕𝒂𝒓⚡ (@ramcharan_yours) • Instagram photos and videos

సినిమాల్లో థర్డ్ సింగిల్ ను నవంబర్ ప్రారంభంలో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వివరించారు. కానీ.. ఇప్పుడు దాన్ని అక్టోబర్ 30న రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. దానిని థ‌మన్ డేట్ తో సహా అనౌన్స్ చేశాడు. దీంతోపాటే గేమ్ ఛేంజ‌ర్‌ సంక్రాంతికి వాయిదా పడుతుందంటూ పలు వార్తలు వినిపించాయి. వాటిపై క్లారిటీ ఇస్తూ.. డిసెంబర్ 20 లేదా క్రిస్మస్ కానుకగా మూవీ రాబోతుందంటూ వెళ్లడించాడు. అలా అభిమానులకు రెండు గుడ్ న్యూస్‌ల‌తోపాటు నిరాశ కల్పించే ఓ బ్యాడ్ న్యూస్ కూడా థ‌మన్ షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం థ‌మన్ షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.