ఈ పై ఫోటోలో కనిపిస్తున్న స్టార్ యాక్టర్ ను గుర్తుపట్టారా.. ఆర్ఎక్స్ 100 సినిమాలో ఓ కీలక పాత్రలో నటించి మంచి ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నాడు. అజయ్ భూపతి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో డాడీ పాత్రలో కనిపించిన మెప్పించాడు. ఆయన అసలు పేరు రామ్కీ. ఈ సినిమాల్లో హీరో తండ్రిగా ఉంటూ పెళ్లి చేసుకోకుండా ఊర్లో కుర్రాళ్లకు పెద్దదిక్కుగా వ్యవహరిస్తాడు. ఇక రామ్కీ పూర్తి పేరు రామకృష్ణ. గతంలో స్టార్ హీరోగా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన రామ్‌కి.. ఘటన, భలే ఖైదీలు, దోషి లాంటి సినిమాల్లో మెప్పించాడు. అలాగే విజయశాంతి ప్రధాన పాత్రలో నటించిన ఒసేయ్ రాములమ్మ లోను చిన్న పాత్రలో కనిపించాడు.
అయితే రామ్కీ భార్య, తన కూతురు పెద్ద స్టార్ హీరోయిన్స్ అన్న సంగతి చాలా మందికి తెలిసి ఉండదు. ఇంతకీ అతని భార్య, కూతుళ్లు ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అతని భార్య మరెవరో కాదు ఒకప్పటి స్టార్ హీరోయిన్ నిరోషా. గతంలో రామ్కీ, నిరోషా కలిసి సింధూరపువ్వు సినిమాలో నటించారు. ఈ సినిమా షూట్ సమయంలో ఇద్దరి మధ్యన ప్రేమ చిగురించడంతో.. 1995లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఇక తన కెరీర్ లో 100కు పైగా సినిమాల్లో నటించిన నిరోషా.. దాదాపు టాలీవుడ్ లో 30 సినిమాలకు పైగా సినిమాలో నటించి మెప్పించింది. బాలయ్య, చిరంజీవి, రాజేంద్రప్రసాద్, మోహన్ బాబు ఇలా ఎంతో మంది స్టార్ హీరోలతో నటించి ఆకట్టుకుంది. బాలయ్య సరసన నారి నారి నడుమ మురారి మూవీ లో హీరోయిన్ గా కనిపించింది.
ఇక రామ్కీతో వివాహం తర్వాత మెల్లగా ఇండస్ట్రీకి దూరమైంది. కాగా రామ్కీకి ఓ అన్న ఉన్నారు. ఆయన ఎవరో కాదు సీనియర్ స్టార్ హీరో శరత్ కుమార్. శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి రామ్కీకి వరుసకు కూతురు అవుతుంది. చాలామందికి రామ్కీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలియకపోవచ్చు. అలా రామ్కీ కూతురు వరస వరలక్ష్మి కూడా బాలకృష్ణతో వీరసింహారెడ్డి సినిమాలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం రామ్కీ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అలాగే ఆయన భార్య నిరోషా కూడా సినిమాలకు దూరం అయ్యింది. ప్రస్తుతం రామ్కీకి సంబంధించిన ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో అంత ఆశ్చర్యపోతున్నారు.