టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మెగా బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రస్తుతం ఐకాన్ స్టార్ గా గ్లోబల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్నాడు. అయితే బన్నీ కెరీర్ ప్రారంభించి ఇప్పటివరకు డెల్ పీరియడ్ అనేది లేదు. వరుస ప్లాప్ లతో సతమతమైన సందర్భాలు కూడా లేవు. అలా కెరీర్ ప్రారంభించి ఇప్పటివరకు మంచి ఫామ్ లో దూసుకుపోతున్న బన్నీ.. ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో నాలుగో సినిమాలో నటిస్తున్నాడు. పుష్పాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.అయితే బన్నీ కెరీర్‌లో తను నటించిన సినిమాల్లో కేవలం కామెడీ వల్ల హిట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. కానీ కమెడియన్ అలీ ఇచ్చిన సలహాతో సినిమా ఫ్లాప్ నుంచి తప్పించుకుంది అన్న సంగతి చాలామందికి తెలిసి ఉండదు. కానీ అది నిజంగానే జరిగిందట.
త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కిన సన్ ఆఫ్ సత్యమూర్తి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోకున్న ఓ మాదిరి హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా విషయంలో త్రివిక్రమ్ చేసిన చిన్న పొరపాటుతో సినిమా అట్టర్ ప్లాప్ అయ్యేదట. కానీ కమెడియన్ అలీ కలుగజేసుకొని ఆ మార్పు చేపించి సినిమాను హిట్ అయ్యేలా చేశాడు. ఇంతకీ త్రివిక్రమ్ తో వాదించి మరీ చేసిన ఆ మార్పు ఒకసారి తెలుసుకుందాం. ఈ సినిమాలో బన్నీ తర్వాత హైలైట్ అయిన పాత్ర ఉపేంద్ర.. దేవరాజ్ పాత్ర. కొన్ని గ్రామాలకు నియంతలా ఆయన వ్యవహరించారు. ఈ సినిమాలో ఉపేంద్ర బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ అల్లు అర్జున్‌తో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమాలో ఉపేంద్ర పాత్రకు త్రివిక్రమ్ వేరొకరితో డబ్బింగ్ చెప్పించాడు. అలీ డబ్బింగ్ చెబుతున్న క్రమంలోనే ఉపేంద్ర రోల్ డైలాగులు కూడా విన్నారట.
ఈ సినిమాలో అలీ ఓ పాత్రలో కనిపించాడు. ఉపేంద్ర వాయిస్ ఏంటి సార్ ఇలా ఉంది.. సినిమాలో కూడా ఇదే ఉంచుతారా.. అని ఆలీ, త్రివిక్రమ్‌ను ప్రశ్నించాడట. అవును ఇదే డబ్బింగ్ ఉంటుందని త్రివిక్రమ్ చెప్పడంతో అసలు ఆయనకు ఈ వాయిస్ ఏ మాత్రం సెట్ కాదు.. థియేటర్లో జనాలు వింటే సినిమాపై కూడా ఎఫెక్ట్ పడుతుంది ఆలోచించుకోమని త్రివిక్రమ్ తో వాదించారట. దీంతో త్రివిక్రమ్ విని.. ఆ డబ్బింగ్ వాయిస్ నిజంగానే చాలా తేడా అనిపిస్తుంది అని చెప్పారట. ఇక మార్చేద్దాం వేరే వారిని తీసుకుందాం ఎవరైతే ఆయన వాయిస్ కు సెట్ అవుతుందని ఆలోచిస్తున్న క్రమంలో.. అలీ ఉపేంద్ర పాత్రకి రవిశంకర్ డబ్బింగ్ అయితే బాగుంటుందని సలహా ఇచ్చాడట. ఇక రవిశంకర్ అప్పటికి టాలీవుడ్ లో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా నటుడుగా రాణిస్తున్నారు. సాయికుమార్ సోదరుడుగా ఇండస్ట్రీలోకి వచ్చారు రవిశంకర్. ఇక వెంటనే త్రివిక్రమ్ రవిశంకర్ ని పిలిపించి ఉపేంద్ర పాత్రకు డబ్బింగ్ చెప్పించాడు. అలా అలీ ఇచ్చిన సలహాతో సన్నాఫ్ సత్యమూర్తి ఫ్లాప్ కాకుండా అడ్డుకున్నాడు.