దండుపాళ్యం హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూశారా.. అమ్మడి అందానికి మతి పోవాల్సిందే..?

దండుపాళ్యం సినిమాను ఎవరు సులభంగం మర్చిపోలేరు. 2012లో రిలీజ్ అయ్యి సంచలన సక్సెస్ సాధించిన ఈ మూవీని రియల్ లైఫ్‌లో జరిగిన కొన్ని సంఘటన ఆధారంగా శ్రీనివాస్ రాజు.. సినిమాను రూపొందించారు. ఈ ఇంట్ర‌స్టింగ్ క్రైమ్ థ్రిల‌ర్ మొదట కన్నడలో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. తర్వాత ఈ మూవీని తెలుగులోను రిలీజ్ చేసి సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఇక అప్పట్లో ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లోనే సరికొత్త ట్రెండ్ సృష్టించి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక మొదటి భాగం బ్లాక్ బస్టర్ సక్సెస్ కావడంతో.. తర్వాత ఫ్రాంచైజ్ సినిమాలు కూడా వచ్చాయి. ఇప్పటివరకు దండుపాళ్యం సిరీస్ లో మొత్తం నాలుగు సిరీస్‌ను రిలీజై మంచి టాక్ సంపాదించుకుంటున్నాయి.

మొదటి భాగంలో పూజ గాంధీ, రవికాలే, మకరందాస్ పాండే, పి.రవిశంకర్, రఘు ముఖర్జీ కీలకపాత్రలో నటించి మెప్పించారు. ముఖ్యంగా కన్నడ నటి పూజా గాంధీ ఈ సినిమాకే హైలెట్. ఆమెను అంత సులువుగా మర్చిపోరు కూడా. బోల్డ్‌గా నటించి ప్రేక్షకులను టెంప్ట్ చేస్తూనే.. మరోవైపు కృరంగా హత్యలు చేస్తూ ప్రేక్షకులను భయపెట్టింది. ఇక పూజ గాంధీ ఎక్కువగా కన్నడ సినిమాల్లోనే కనిపించింది. తెలుగు, తమిళ్ భాషల్లో కొన్ని సినిమాల్లో నటించినా ఊహించిన రేంజ్‌లో అమ్మడు సక్సెస్ అందుకోలేదు. అయితే దండుపాళ్యం సినిమాతో మాత్రం అమ్మడికి మంచి క్రేజ్ వచ్చింది. కాగా తన పదేళ్ల సినీ కెరీర్‌లో.. సుమారు 50కి పైగా సినిమాలో నటించిన ఈ అమ్మడు.. 2021 తర్వాత సినిమాలకు చెక్‌ పెట్టేసింది.

చివరిగా దండుపాళ్యం 3 సినిమాలో కనిపించిన పూజా గాంధీ.. గతేడాది నవంబర్‌లో ప్రముఖ బిజినెస్‌మ్యాన్ విజయ్ ఘోర్పడేను వివాహం చేసుకుంది. సినిమాలకు దూరంగా ఉన్న ఈ బోల్డ్ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. తన రెగ్యులర్ ఫొటోస్ ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉండే పూజ గాంధీ.. దండుపాళ్యం సినిమాలో మొర‌టుగా కనిపించిన నిజజీవితంలో మాత్రం అందంగా, దర్జాగా, హుందాతనం ఉట్టిపడేలా లుక్‌తో ఆకట్టుకుంటుంది. అలా తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటో నెటింట తెగ వైరల్‌గా మారింది. దానిని చూసిన నెటిజ‌న్స్ వామ్మో.. అసలు ఈమె దండుపాళ్యం హీరోయిన్ ఏనా.. ఏంటి ఇంత అందంగా ఉంది.. ఇంతలా మారిపోయింది ఏంటి.. అంటూ ఆశ్చర్యపోతున్నారు. అమ్మడి అందం చూస్తే మతిపోవాల్సిందే.. అసలు సినిమాలోకి రియల్ లైఫ్ లోకి సంబంధమే లేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు