టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ జంటకు టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. వీరిద్దరి కాంబో సినిమా వస్తుందంటే.. ఈ సినిమా ఖచ్చితంగా మంచి సక్సెస్ అందుకుంటుందన్న నమ్మకంతో ఉంటారు అభిమానులు. అలా ఇప్పటివరకు ఎన్టీఆర్, సమంత కాంబోలో ఏకంగా నాలుగు సినిమాలు వచ్చాయి. ఇక ప్రతి సినిమాలో ఒక కామన్ పాయింట్ ఉంటుంది. అది మీరు ఎప్పుడైనా గమనించారా.. ఇంతకీ ఆ కామన్ పాయింట్ ఏంటో.. అసలు సమంత, ఎన్టీఆర్ కలిసి నటించిన సినిమాల లిస్టు ఏంటో ఒకసారి తెలుసుకుందాం.
ఇక ఎన్టీఆర్ – సమంత కలిసి మోదటిగా నటించిన మూవీ బృందావనం. ఈ సినిమా రిలీజై మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమాలో సమంతతో పాటు.. కాజల్ అగర్వాల్ కూడా హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో సినిమా తెరకెక్కింది. ఇక వీరిద్దరు కాంబోలో వచ్చిన రెండో మూవీ రామయ్య వస్తావయ్య. ఈ సినిమాలో కూడా సమంతతో పాటు శృతిహాసన్ నటించిన సంగతి తెలిసిందే. హరిష్‌శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది. కాగాఆ వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన మూడవ సినిమా రభస. ఈ సినిమాలో కూడా సమంతతో పాటు ప్రణీత హీరోయిన్గా కనిపించింది.
మంచి అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది. ఈ మూవీకి సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, సమంత హీరోయిన్గా నటించిన నాలుగో మూవీ జనతా గ్యారేజ్. ఇందులోను సమంతతో పాటు నిత్యమైన మరో హీరోయిన్గా ఆకట్టుకుంది. మంచి అంచనాలతో ఈ సినిమా రిలీజై బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అందుకుంది. కొరటాల ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇలా ఇప్పటివరకు సమంత, ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కిన నాలుగు సినిమాల్లోనూ సమంతతో పాటు మరో హీరోయిన్ కూడా నటించడం కామన్ పాయింట్.