టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్గా అడుగు పెట్టి రాణిస్తున్న ప్రతి ఒక్కరికి ఎంత కొంత పాన్ ఫాలోయింగ్ ఉండనే ఉంటుంది. ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి చెందిన అభిమాన సెలబ్రిటీ కి సంబంధించిన అన్ని విషయాలను తెలుసుకోవాలని ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంటుంది. ఇందులో భాగంగా గత కొద్దిరోజులుగా సినీ సెలబ్రిటీల చిన్ననాటి ఫొటోస్ నెటింట తెగ వైరల్ గా మారుతున్నాయి. అలా తాజాగా ఈ పై ఫోటోలో కూర్చుని అమాయకంగా చూస్తున్న పాప ఫోటో వైరల్ గా మారుతుంది. దశాబ్దాలుగా ఇండస్ట్రీని ఏలేస్తున్న ఈ స్టార్ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా..? ఈమె తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మళయాళ ఇలా భాషతో సంభంధం లేకుండా అన్ని భాషల్లోని నటించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.
ప్రస్తుతం పాన్ ఇండియన్ బ్యూటీగా దూసుకుపోతున్న ఈ అమ్మడు.. సోషల్ మీడియాలోను యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌కు హాట్ ట్రీట్ ఇస్తుంది. ఈ క్రమంలోనే అమ్మడు తన చిన్ననాటి ఫొటోస్ అభిమానులతో షేర్ చేసుకుంది. అందులో ఓ ఫోటో ఇప్పుడు తెగ వైరల్ గా మారుతుంది. పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మడు ఎవరో ఇప్పటికైనా గుర్తుపట్టారా..? ఆమె టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్న. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలోను విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ అమ్మడు.. వెండితెరపైనే కాదు డిజిటల్ ప్లాట్ ఫామ్ లోనే తన నటనతో దూసుకుపోతుంది.
ఇటివల బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న స్త్రీ 2 లో స్పెషల్ సాంగ్ లో ఆకట్టుకున్న తమన్నా.. వయసు ప్రస్తుతం 34 ఏళ్ళు. ఇక గత కొంతకాలంగా తమన్న బాలీవుడ్ నటుడు విజయ వర్మతో రిలేషన్ షిప్ లో ఉంది. ఇద్దరి ప్రేమ విషయాన్ని గతంలో అఫీషియల్ గా వెల్లడించారు. అయితే కొన్ని రోజులుగా అమ్మడికి పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న తెగ వేధిస్తుందంటూ ఇటీవల ఇంటర్వ్యూలో వివరించింది తమన్న. నాకు పెళ్లంటే భయమని.. అలాగే తను తల్లిని కావడానికి భయపడుతున్నానంటూ వివరించింది. తల్లులు సర్వస్వం తమ పిల్లలకు అందిస్తారని.. కానీ నేను పిల్లలకు అంత ప్రేమ, సంరక్షణ, శ్రద్ధ ఇవ్వలేనంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. పిల్లలు పుట్టాక ఏం జరుగుతుందో ఊహిస్తేనే భయమేస్తుందంటూ వివరించింది.