సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకుని లక్షలాదిమంది అభిమానుల్లో చెరగని ముద్ర వేసుకుంది శ్రీదేవి. టాలీవుడ్ అతిలోకసుందరిగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ అమ్మడు ఎన్నో భాషల్లో అద్భుత నటనతో ఆకట్టుకుంది. బాలీవుడ్ నిర్మాత బోణికపూర్ ను వివాహం చేసుకున్న శ్రీదేవికి.. ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వాళ్ళలో పెద్ద కూతురు జాన్వి కాగా.. చిన్న కూతురు ఖుషి కపూర్. ప్రస్తుతం ఈ ఇద్దరు ఇండస్ట్రీలో హీరోయిన్లుగా రాణిస్తున్నారు. అయితే శ్రీదేవి తన చిన్న కూతురు ఖుషి కపూర్ నటి అయిన పర్వాలేదు కానీ.. జాన్వి మాత్రం సినిమాలకు దూరంగా ఉండాలని మొదటినుంచి అనుకునేదట.
జాన్వి ధడక్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తర్వాత కూడా మంచి కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ గుంజన్ సక్సేనా, మిస్టర్ అండ్ మిసెస్ మాహి ఇలా ఎన్నో సినిమాల్లో నటించింది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో సౌత్ ఆడియన్స్‌ను పలకరించింది జాన్వి కపూర్. ఈ సినిమా తర్వాత టాలీవుడ్‌లో మరో మూడు సినిమాల్లో నటించనుంది. ఇదిలా ఉంటే ఖుషి కపూర్.. జోయా అక్కర్ డైరెక్షన్లో ఆర్చిస్ అనే ఓ మ్యూజికల్ మూవీతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో చాలామంది స్టార్ కిడ్స్ నటించారు. ఖుషి కపూర్ కి బాలీవుడ్ లో మంచి అవకాశాలు వస్తున్నాయి.
ఈ క్రమంలో జాన్వీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను రివీల్ చేసింది. తల్లి శ్రీదేవి గురించి మాట్లాడుతూ.. మా అమ్మ ఎప్పుడు నేను నటి కావాలని కోరుకోలేదు. నటిగా ఉండడం ఎంత కష్టమనే విషయం ఆమెకు తెలుసు. అందుకే అమ్మ నన్ను ఎప్పుడు ఆ దారిలోకి రాకుండా డీవియేట్ చేయాలని భావించేది. నన్ను ఒక డాక్టర్గా చూడాలని ఆమె అనుకుంది. కానీ.. నాకు నటన తప్ప మరొకటి రాదు. చివరకు నటిగానే మారా అంటూ జాన్వి చెప్పుకొచ్చింది. అయితే శ్రీదేవి తన చిన్న కూతురు ఖుషి కపూర్ నటి కావాలని అనుకునేవారట. చిన్నప్పటి నుంచి ఖుషి కపూర్ ఇండిపెండెంట్గా, ధైర్యంగా ఉండేదని.. అందుకే తన సినిమాల్లోకి వెళ్లిన రాణించగలదని నమ్మిన శ్రీదేవి.. ఖుషి హీరోయిన్ అవ్వాలని అనుకునేదని.. జాన్వీకపూర్ వివరించింది.