ఘట్టమనేని నటవారసుడిగా.. సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా ఇండస్ట్రీలోకి మహేష్ బాబుతో పాటు.. కృష్ణ పెద్ద కొడుకు రమేష్ బాబు కూడా ఎంట్రీ ఇచ్చిన సంగతి చాలా మందికి తెలుసు. రమేష్ బాబు కూడా హీరోగా ఎన్నో సినిమాల్లో నటించాడు. అల్లూరి సీతారామరాజు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచిన్న రమేష్ బాబు.. ఈ సినిమా తర్వాత సామ్రాట్ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. చివరిగా 1997లో ఎన్.శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఎన్కౌంటర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.
మొదట్లో హీరోగా నటించిన రమేష్ బాబు.. తర్వాత నిర్మాతగా మరి ఎన్నో సినిమాలకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించాడు. మహేష్ బాబు హీరోగా నటించిన అర్జున్, అతిది, దూకుడు సినిమాలకు కూడా రమేష్ బాబు ప్రొడ్యూసర్ కావడం విశేషం. ఇక రమేష్ బాబు 8 జనవరి 2022లో కాలేయ సంబంధిత వ్యాధితో తుది శ్వాసవిడిచారు. ఇక మహేష్ బాబుకు మొదటి నుంచి తన అన్న రమేష్ బాబు అంటే ఎనలేని ప్రేమ. ఎన్నో సందర్భాల్లో ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించాడు. రమేష్ బాబు చనిపోయిన సమయంలో.. మహేష్ బాబుకు కరోనా రావడంతో తన అన్న చివరి చూపును కూడా మహేష్ నోచుకోలేకపోయారు. రమేష్ బాబుకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. రమేష్ బాబు కొడుకు జయకృష్ణ త్వరలోనే హీరోగా ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడు.
ఇక రమేష్ బాబు కూతురు భారతి గురించి చాలామందికి తెలిసి ఉండదు. జయకృష్ణ హీరో మెటీరియల్‌గా ఉంటే.. రమేష్ బాబు కూతురు భారతి కూడా చూడచక్కగా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. సినీ ఇండస్ట్రీలోకి ఈ అమ్మడు రావాలని.. ఘట్టమనేని అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఈ అమ్మడికి ఎకౌంట్ ఉన్న.. పెద్దగా యాక్టివ్ గా కనిపించదు. అయితే ప్రస్తుతం తను చదువులో బిజీగా గడుపుతున్న భారతీ త్వరలోనే ఇండస్ట్రీలోకి వస్తుందని అంతా భావిస్తున్నారు. చూడడానికి హీరోయిన్ మెటీరియల్‌లా అనిపిస్తున్న ఈ అమ్మడు ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్లను కూడా తలదన్నే అందంతో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం భారతికి సంబంధించిన ఫొటోస్ నెటింట వైరల్ గా మారడంతో అమ్మడి అందం ముందు స్టార్ హీరోయిన్లు కూడా బలాదూర్.. హీరోయిన్ మెటీరియల్ అంటూ.. కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్.