దేవరకు ఇంకా 30 రోజులే.. ఎన్టీఆర్ పైనే భారం అంతా..!

టాలీవుడ్ యంగ్‌ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న తాజా మూవీ దేవర. కొరటాల శివ డైరెక్షన్‌లో తెర‌కెక్కుతున్న‌ ఈ సినిమా కోసం.. ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. తారక్ నుంచి సినిమా వచ్చి ఇప్పటికే చాలా రోజులు కావడంతో.. వెండి తెరపై సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు.. సినిమా రిలీజ్ డేట్ మరికొద్ది రోజుల్లోనే ఉండడంతో సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయో అంటూ చూస్తున్నారు. జనతా గ్యారేజ్ తర్వాత హీరో ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న రెండో సినిమా కావడం.. దివంగత అతిలోకసుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ఇందులో హీరోయిన్ గా నటించడంతో.. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత హైప్‌ పెరిగింది.

ఇక బాలీవుడ్ నటుడు సైఫ్ అలా ఖాన్ ఈ సినిమాలో ప్రతి నాయకుడుగా కనిపించనున్నాడు. విస్మరణకు గురైన సముద్ర తీర ప్రాంత నేపథ్య కథతో సినిమా రూపొందుతుంది. ఈ క్రమంలో సినిమాకు 30 రోజుల గ్యాప్ ఉండడంతో.. ప్రీ రిలీజ్ బిజినెస్ లు భారీగా జరుగుతున్నాయి. ఆ బ్రేక్ ఈవెన్‌ సాధించాలంటే ఎన్టీఆర్ పైనే ప్రెజర్ ఉంటుంది. తెలుగులో ఈ సినిమా ప్రమోషన్స్ స్పీడుగా జరుగుతున్న క్రమంలో సినిమాపై మంచి బ‌జ్‌ క్రియేట్ అవుతుంది. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ సోలోగా పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆర్ఆర్ఆర్‌తో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న ఈయన.. బాలీవుడ్ లోనూ దేవరతో భారీ రిలీజ్‌కు ప్లాన్ చేశారు. అయితే ఇప్పటిదాకా అక్కడ ప్రమోషన్స్ ప్రారంభించకపోవడంతో ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి.

ఎన్టీఆర్ మీద అక్కడ ప్రమోషన్స్ బాధ్యతలు మొత్తం పెట్టదలుచుకున్నారా.. సైప్‌ను హైలెట్ చేస్తూ ప్రమోషన్ చేస్తే అతని సినిమాగా మారిపోతుందేమో.. అందుకే మెయిన్ సెంటర్స్ లో ఎన్టీఆర్ను ప్రమోషన్స్ లో దింపి కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తున్నారట. ఇక అనిరుధ్ లాంటి టాప్ టెక్నీషియన్స్ ఉన్న తమిళనాడులో ఎలాంటి ప్రమోషన్స్ లేవు. ఎన్టీఆర్‌కు కర్ణాటకలో ప్రత్యేక మార్కెట్ ఉంది. అయినా ప్రమోషన్స్ కనుక.. బెంగళూరులో మినిమం ప్రెస్ మీట్ అయిన పెట్టి ఎన్టీఆర్ సినిమాపై హెప్‌ తేవాల్సి ఉంటుంది. అలా మొత్తం తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, మలయాళ ఐదు భాషల్లోనూ డిఫరెంట్ మార్కెట్లలో ఎన్టీఆర్ కవర్ చేయాల్సి ఉంటుంది.

Jr. NTR assures Devara will make fans raise their 'collars with pride' at  Tillu Square success meet: “The wait will be worth it” : Bollywood News -  Bollywood Hungama

అయితే కేవలం సినిమా రిలీజ్ కు 30 రోజులే టైం ఉంది. ఇక ఈ ప్రాజెక్టు ఎన్టీఆర్ పాన్ ఇండియా మార్కెట్ పై బాగా బేస్ అయ్యి ఉంటుంది. ఈ సినిమాతోనే.. ఎన్టీఆర్ తర్వాత నటించబోయే ప్రశాంత్ నీల్‌ కాంబో మూవీ, వార్ 2 సినిమాలపై కూడా మార్కెట్ ప్రభావం పడుతుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ భారం అంతా ఎన్టీఆర్ పైనే పడింది. ఆయన ఏం చేస్తారో.. ఎలా తన సినిమాకు మార్కెట్ క్రియేట్ చేసుకుంటారు.. వేచి చూడాలి. ఇక ఈ సినిమా వచ్చేనెల సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ కానుంది. సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.