అక్కినేని సీనియర్ హీరో నాగార్జున.. ఆరు పదుల వయసు దాటినా ఇప్పటికీ ఇంకా యంగ్ లుక్ తో కుర్రాళకు గట్టి పోటీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా తన 63వ పుట్టినరోజు జరుపుకున్న నాగార్జునకు ఫ్యాన్స్ భారీ లెవెల్ లో సెలబ్రేషన్స్ చేశారు. అంతే కాదు నాగార్జున బర్త్డే పురస్కరించుకుంటూ మాస్ సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నాగార్జునకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా నెట్టింట వైరల్ గా మారాయి. ఇక నాగ్ రీల్ లైఫ్ లో మన్మధుడు సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. రియల్ లైఫ్ లోను మన్మధుడు ట్యాగ్ నాగార్జునకు అడాప్ట్ అయిపోయింది.
ఇక ఇప్పటికే ఫిలిం నగర్ తెలుగులో ఎంతమంది నాగార్జునను మన్మధుడు అనే పిలుస్తూ ఉంటారు. ఇక అలాంటి అక్కినేని అందగాడికి ఇప్పటివరకు ఎంతమంది హీరోయిన్లు ఫిదా అయ్యారో ఒకసారి చూద్దాం. నాగార్జున ఎఫైర్ విషయం వినిపించగానే టక్కున గుర్తుకు వచ్చే మొదటి పేరు టబ్బు. ఐదు పదుల వయసు దాటిపోయిన ఈ అమ్మడు.. ఇంకా నాగార్జున కోసం ఎదురు చూస్తూ పెళ్లి చేసుకోవడం మానేసింది అని ఇండస్ట్రీలో టాక్. అలాగే మరో బ్యూటీ అనుష్క శెట్టికి కూడా నాగార్జునతో ఉందని వార్తలు వినిపించాయి. ఇక మరో నటి రమ్యకృష్ణతో నాగార్జున ఎఫైర్ ఉందంటూ వార్తలు వినిపించాయి. వీరిద్దరు కాంబినేషన్‌లో ఎన్నో సినిమాలు తెరకెక్కి మంచి సక్సెస్ అందుకున్న క్రమంలో.. మీరిద్దరిపై కూడా ఎఫైర్ వార్తలు వైరల్ అయ్యాయి.
అలాగే సీనియర్ బ్యూటీ రజినీతోను నాగార్జున ఎఫైర్ నడుపుతున్నాడంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. భక్తి రస సినిమా శ్రీరామదాసు, రాజన్న సినిమాల్లో నాగార్జునతో జంటగా నటించిన స్నేహ తోను నాగార్జునకు రిలేషన్ వార్తలు వినిపించాయి. అంతేకాదు శ్రీయ, త్రిష లాంటి హీరోయిన్స్ కూడా నాగార్జునతో డేటింగ్ చేశారని వార్తలు వినిపించాయి. అలా నాగార్జున సినీ కెరీర్‌లో సినిమాల హైలెట్స్ కంటే ఎక్కువగా.. అమ్మాయిల ఎఫైర్ వార్తలతోనే నెట్టింట వైరల్ అవుతూ ఉంటారు.