సినీ ఇండస్ట్రీలో ప్రతి ఏడది ఎంతోమంది స్టార్ హీరో హీరోయిన్లుగా, సెలబ్రెటీల్ గా మారాలని ఆశక్తితో అడుగు పెడుతుంటారు. దానికోసం వారు అహర్నిశలు శ్రమిస్తూ ఉంటారు. అలా చాలామంది తమ చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలోనే సినిమాల్లో హీరోయిన్గా అవకాశాలు దక్కించుకొని ఆ సినిమాలతో సక్సెస్ అందుకునే స్టార్ హీరోయిన్గా రాణించిన వారు కూడా ఉన్నారు. అలా మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సక్సెస్ సాధించిన వారు ఎవరో ఒకసారి చూద్దాం.
చార్మి కౌర్:
చార్మి ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా వరుస సినిమాలో నటిస్తూ మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. మాస్, అనుకోకుండా ఒక రోజు, లక్ష్మీ, పౌర్ణమి, రాఖి ఇలా వరుస సినిమాల్లో నటించి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అందంతో పాటు అభినయంతో ఆకట్టుకుంది. గ్లామర్ షోతో కుర్రాళ్లను కట్టిపడేసింది. ఇక దాదాపు 22 ఏళ్ల క్రితం నీ తోడు కావలి సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈఅమ్మడి వయస్సు ఆ సినిమా సమయానికి కేవలం 15 ఏళ్ళేనట. అంత తక్కువ వయసులో ఈమె కంటే ముందు మరెవరు హీరోయిన్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వలేదు.
తమన్నా:
మిల్కీ బ్యూటీ తమన్నా తన పదహారేళ్ళ వయసులోనే మంచు మనోజ్ హీరోగా నటించిన శ్రీ.. సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. ఈ సినిమా తర్వాత 2007లో రిలీజ్ అయిన హ్యాపీ డేస్ సినిమాతో అమ్మడికి మంచి ఇమేజ్ క్రియేట్ అయింది. తర్వాత పలు సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ తమన్నా.. హీరోయిన్గా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌తో రాణిస్తుంది.
హన్సిక మోత్వాని:
రోజ్ బ్యూటీ హన్సిక మోత్వాని దేశముదురు సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సినిమా రిలీజ్ టైం కి ఆమె వయసు కేవలం 16ఏళ్లు కావడం విశేషం. ఇక ఈ సినిమాతో హన్సిక నటనకు మంచి మార్కులు పడ్డాయి. తర్వాత మస్కా, కంత్రీ లాంటి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది.
అవికా గోర్:
బబ్లి బ్యూటీ అవికా గోర్ కు టాలీవుడ్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 2013లో ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్గా ఇంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది. ఇక ఉయ్యాల జంపాల టైంకి అవికా గోర్ వయసు 16 ఏళ్లు మాత్రమే. సినిమా చూపిస్త మామ, ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాలతో కూడా ఈ అమ్మడుకి మంచి ఇమేజ్ క్రియేట్ అయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వయస్సు 27 ఏళ్ళు. అయితే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి అవికా గోర్ ఫేడ్ అవుట్ అయిపోయింది.
శ్వేతా బసు ప్రసాద్:
వరుణ్ సందేశ్ హీరోగా నటించిన కొత్త బంగారులోకం సినిమాతో టాలీవుడ పరిచయం అయింది శ్వేతా బసు ప్రసాద్. ఈ సినిమా టైం కి ఈ అల్లరి పిల్ల వయసు కేవలం 17 ఏళ్లు.
కృతి శెట్టి:
బుచ్చిబాబు సన్న డైరెక్షన్‌లో మెగా హీరో విష్ణు తేజ్ హీరోగా వచ్చిన మూవీ ఉప్పెనతో కృతి శెట్టి ఎలాంటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. బేబమ్మ పాత్రతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాతోనే కురకారును విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఉప్పెన సినిమా టైమ్ కి కృతి శెట్టి వయసు కేవలం 17 ఏళ్లు మాత్రమే.