ఎన్బికె 109 సక్సెస్ కోసం ఆ సెంటిమెంట్ ఫాలో అవుతున్న బాబి.. ప్లాన్ వర్కౌట్ అవుతుందా..?

టాలీవుడ్‌లో తన సినిమాలతో ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న‌ దూసుకుపోతున్న క్రేజీ దర్శకులలో బాబి కూడా ఒకడు. మొదట రవితేజ హీరోగా బ‌చ్చిన‌ పవర్ సినిమాతో డైరెక్టర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ఈ యంగ్ డైరెక్టర్.. ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. దీంతో బాబీకి డైరెక్టర్ గా మంచి ఇమేజ్ క్రియేట్ అయింది. తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాని తెర‌కెక్కించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. ఇక బాబి నుంచి చివరిగా తెర‌కెక్కిన మూవీ వాల్తేరు వీరయ్య.

Balakrishna to join the sets of NBK109 soon | Latest Telugu cinema news |  Movie reviews | OTT Updates, OTT

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, శృతిహాసన్ హీరోయిన్గా తెరకెక్కిన ఈ మూవీ పక్క కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ మూవీ గా రూపొందింది గతేడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజై బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన సక్సెస్ అందుకోవడమే కాదు.. సంక్రాంతి బరిలో విన్నర్‌గా నిలిచింది. ఇక ప్రస్తుతం బాబి, నందమూరి నట‌సింహంబాలకృష్ణ హీరోగా ఆయన 109వ‌ సినిమాకు దర్శకత్వం వ‌హిస్తున్నాడు. అయితే ఇంకా ఈ సినిమా టైటిల్‌ మేకర్స్ అనౌన్స్ చేయలేదు. ఈ క్రమంలో ఎన్బికె 109 వర్కింగ్ టైటిల్‌తో సినిమా షూట్ జరుగుతుంది. ఇక‌ ఇప్పటికే సినిమా షూట్ చాలా బాగం పూర్తయినా.. రిలీజ్ డేట్, టైటిల్ మేకర్స్ అనౌన్స్ చేయలేదు.

బాబీ సినిమాలో బిగ్ ట్విస్ట్... ఇదెక్కడి మాస్ కాంబోరా బాబు... బాలయ్యతో పాటు  మరో స్టార్ హీరో! | Nandamuri Balakrishna and Mass Maharaj Raviteja multi  starrer movie under bobby ...

ఇకపోతే ప్రస్తుతం అందుతున్న వార్తలు ప్రకారం ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలని మూవీ యూనిట్ భావిస్తున్నారట. అందుకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన మరి కొద్ది రోజుల్లోనే రాబోతుందంటూ నెటింట‌ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో బాబి చివరగా తెర‌కెక్కించిన వాల్తేరు వీరయ్య సినిమాను కూడా సంక్రాంతి పండుగలోనే రిలీజ్ చేసి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇదే సెంటిమెంట్ ను ఇప్పుడు రిపీట్ చేయాలని ఉద్దేశంతో మూవీ టీం ఫిక్స్ అయ్యారట. ఇక ఎన్బికె 109 మూవీ సంక్రాంతి బరిలో రిలీజై ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో..? బాబి బ్లాక్ బస్టర్ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందో..? లేదో..? వేచి చూడాలి.