ఒకటే హీట్, రెండు ఫ్లాప్‌లు.. తారక్ కు అచ్చురాని ఆ బ్యూటీ ఎవ‌రో తెలుసా..?

నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఉన్న ఫ్యాన్ బేస్‌, క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న ఎన్టీఆర్.. ఇప్పటికే ఎన్నో బ్లాక్ బ‌స్టర్ సక్సస్‌లు అందుకొని మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఎలాంటి పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేసి నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే తారక్.. ఎంతో మంది స్టార్ హీరోయిన్లతో నటించి మెప్పించాడు. ఈ క్రమంలో తారక్ ఒకటి రెండు సినిమాలు కంటే ఎక్కువ సినిమాలు ఒకే హీరోయిన్ తో నటించిన సందర్భాలు కూడా ఉన్నాయి.

బృందావనం (2010 సినిమా) - వికీపీడియా

అలా ఓ హీరోయిన్ తో తారక్ నటించిన మూడు సినిమాల్లో.. కేవలం ఒక సినిమా హిట్ అయి.. మిగతా రెండు సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి. దీంతో ఎన్టీఆర్ సినిమాలకు ఆ హీరోయిన్ అస్సలు అచ్చు రాలేదంటూ కామెంట్లు వెల్లువ‌య్యాయి. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. ఆ సినిమాలో డీటెయిల్స్ ఏంటి.. ఒకసారి చూద్దాం. తెలుగు స్టార్ బ్యూటీ సమంతకు టాలీవుడ్ లో మంచి ఇమేజె ఉన్న‌ సంగతి తెలిసిందే. అయితే సమంత తన కెరీర్ బిగినింగ్ లో ఎన్టీఆర్ తో కలిసి బృందావనం సినిమాలో నటించగా ఇది బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడమే కాదు.. ఈ సినిమాతో సమంతకు మంచి ఇమేజ్ క్రియేట్ అయింది. ఈ సినిమాతో ఎన్టీఆర్, సమంత జోడుకి ప్రేక్షకుల నుంచి ప్రశంసలందాయి.

Ramayya Vasthavayya (2013) | V CINEMA - Movie, Review, Cast, Songs &  Release Date

తర్వాత వీరి కాంబినేషన్‌లో హరీష్ శంకర్ డైరెక్షన్‌లో రామయ్య వస్తావయ్య సినిమా తెర‌కెక్కింది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘోర‌డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లు వ‌చ్చిన‌ మరో మూవీ రభస. ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో మొదటి నుంచి మంచి హైప్‌ నెలకొంది. అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. అలా తారక్, సమంత కాంబోలో వచ్చిన బృందావనం తప్పా.. మిగతా రెండు సినిమాలు భారీ డిజాస్టర్లుగా నిలవడంతో సమంత, ఎన్టీఆర్‌కు అస్సలు అచ్చు రాలేదంటూ ఫ్యాన్స్ త‌మ అభిప్రాయాలు వ్య‌క్తం చేశారు.