టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగ వర్సెస్ సినిమాల్లో నటించి మెప్పించిన చాలామంది కథానాయికలు.. ఒక్కసారిగా ఇండస్ట్రీ నుంచి దూరమైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలా ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోల అందరి సరసన నటించి మెప్పించి.. ఇండస్ట్రీ నుంచి టక్కున మాయమైన హీరోయిన్ల రచన బెనర్జీ ఒకటి. టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. శ్రీకాంత్ నటించిన కన్యాదానం సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడంతో స్టార్ హీరోయిన్ ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. తర్వాత ఈ ముద్దుగుమ్మ ఎన్నో సినిమాల్లో ట్రెడిషనల్ లుక్ తో తన క్యూట్ క్యూట్ స్మైల్ తో లక్షలాది మంది అభిమానుల్లో చెరగని ముద్ర వేసుకుంది.
కన్యాదానంతో పాటు.. నేను ప్రేమిస్తున్న, మావిడాకులు, బావగారు బాగున్నారా, అభిషేకం, పిల్ల నచ్చింది, లాహిరి లాహిరి లాహిరిలో ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి మెప్పించింది. ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది. అయితే ఇండస్ట్రీలోకి ఎంత త్వరగా స్టార్‌డం సంపాదించుకుందో.. అంతే ఫాస్ట్ గా ఫేడౌట్ అయ్యింది. ఇక సినిమాల్లోకి రాకముందు మిస్ కలకత్త టైటిల్ సంపాదించుకున్న రచన బెంగాలీ సోయోగం అయినప్పటికీ.. చూడడానికి తెలుగింటి ఆడపడుచుల కనిపిస్తుంది.
అయితే ఈ అమ్మడు ఇండస్ట్రీలో కొనసాగిన కొంతకాలంలోనే ఏ హీరోయిన్ టచ్ చేయలేని అరుదైన రికార్డును సంపాదించుకుంది. ఒకే హీరోతో ఏకంగా 40 కి పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఒరియాలో మొత్తం 50 సినిమాల్లో నటించగా.. వాటిలో ఏకంగా 40 సినిమాల్లో సిద్ధాంతి మహాపాత్ర సరపన హీరోయిన్గా నటించి మెప్పించింది. అయితే నటించిన అతి తక్కువ సినిమాల్లోనే 40 సినిమాల్లో ఒక హీరోతో నటించడం అనేది నిజంగా ఇంట్రెస్టింగ్ విషయమే. అప్పట్లో ఒరియా ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్ హీరోగా దూసుకుపోతున్న ఈ హీరోతో రచన అప్పట్లో ప్రేమలో పడి అతని వివాహం చేసుకుంది. తర్వాత మనస్పర్ధలతో ఇద్దరు విడాకులు తీసుకున్నారు.