సౌత్ ఇండస్ట్రీలో సొంత విమానం కొనుగోలు చేసిన ఫస్ట్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో పోటీపడి మరి హీరోయిన్స్ రెమ్యున‌రేష‌న్‌ అందుకుంటున్న సంగతి తెలిసిందే. కోట్లకు కోట్లు తీసుకుంటూ లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మలంతా.. ల‌గ్జ‌రీ బంగ్లాల‌తోపాటు లగ్జరీకారులు, బైకులు ఇలా కోట్లు ఖర్చు చేసి మరి జీవితాన్ని విలాసవంతంగా గడుపుతున్నారు. అయితే కొంతమంది సొంత విమానాలను కూడా కొనుగోలు చేసి లైఫ్ లీడ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అలా ఇప్పటికే మన సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్గా ఎదిగిన‌ రాంచరణ్, నాగార్జున, ఎన్టీఆర్, నయనతార, రజినీ, కమల్ హాసన్ ఇలా ఎంతోమంది తమ సొంత విమానాలను కొనుగోలు చేసి ఇప్పటికే ఎక్కడికైనా దూరప్రాంతాలు వెళ్లాలంటే తమ ఓన్ ఫ్లైట్ల‌తో విహారం చేస్తున్నారు.

ఈ క్రమంలో సౌత్ ఇండస్ట్రీలో మొట్టమొదట ఓన్ ఫ్లైట్ కొనుగోలు చేసిన‌ హీరోయిన్ ఈమె అంటూ ఓ న్యూస్ వైర‌ల్ అవుతుంది. అయితే ఆమె నయనతార మాత్రం కాదట. దాదాపు 45 ఏళ్ల క్రితమే ఓ హీరోయిన్ వెండితెరపై వరుస‌ సినిమాలో నటిస్తూ ఓ వెలుగు వెలిగింది. ఈ అమ్మడు అప్పట్లోనే తన రెమ్యూనరేషన్ అంత దాచుకొని సొంత విమానాన్ని కొనుగోలు చేసిందట. ఆమె ఎవరో కాదు కే.ఆర్. విజయ. అప్పట్లో ప్రైవేట్ జ‌ట్ కొనుగోలు చేసిన మొట్ట‌మొద‌టి సౌత్ ఇండియన్ హీరోయిన్ గా రికార్డ్ సృష్టించింది ఈ అమ్మడు.

తమిళ సోయ‌గం. 1970లో టాప్ స్టార్ హీరోయిన్గా మంచి ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్న విజయ.. అప్పట్లో బిజీబిజీగా మారిపోయింది. ప్రతి ఏడాది పదికి పైగా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోయింది. తెలుగులోనే కాక కన్నడ, మలయాళ, తమిళ్ భాషలోను ఎన్నో సినిమాల్లో నటించిన ఈ అమ్మడు.. సౌత్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. దాదాపు 500 కు పైగా సినిమాల్లో నటించి మెప్పించిన ఈమె.. అప్పట్లోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్గా సంచలనం సృష్టించింది. అంతేకాదు లగ్జరీ బంగ్లా.. కోట్ల ఆస్తి ఈమె సొంతం చేసుకుంది. ఓ ప్రైవేట్ జట్టును కూడా కొనుగోలు చేసి అందరికీ షాక్ ఇచ్చింది. అప్పుడప్పుడు ఆలస్యమైతే తన సొంత విమానం లోనే కే.ఆర్. విజయ షూటింగ్‌కు కూడా వెళ్లేవారట.