తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవి, బాలకృష్ణ స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. దాదాపు 5 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న ఇద్దరు.. ఇప్పటికీ యంగ్ హీరోలకు గట్టి పోటీ చేస్తూ వరుస సినిమాల్లో నటిస్తున్నారు. ఈ క్రమంలో చిరంజీవి రిజెక్ట్ చేసిన ఓ సినిమాను బాలకృష్ణ నటించి ఇండస్ట్రియల్ హిట్ కొట్టాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ మూవీ ఏంటో.. ఒకసారి తెలుసుకుందాం. కోడి రామకృష్ణ డైరెక్షన్లో బాలయ్య హీరోగా తెరకెక్కిన మంగమ్మగారి మనవడు ఎలాంటి సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అయితే ఈ సినిమా కథను మొదట రామకృష్ణ చిరంజీవి గారికి వినిపించారట. అయితే ఆయన కథ నచ్చకపోవడంతో సినిమాను రిజెక్ట్ చేశాడు. దీంతో ఈ కథను కోడి రామకృష్ణ బాలయ్యకు చెప్పడం.. ఆయనకు కథ నచ్చడంతో వెంటనే దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఇక సినిమాను భార్గవ్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎస్. గోపాలరెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. భానుమతి కీలకపాత్రలో, సుహాసిని హీరోయిన్గా నటించిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని సాధించింది. ఏకంగా 600 రోజులు నిరంతరాయంగా థియేటర్స్ లో రన్ అయి రికార్డ్ సృష్టించింది.
బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న రోజు నుంచి ఇప్పటివరకు మెగాస్టార్ చిరంజీవి ఆ సినిమా విషయంలో ఎంతో బాధపడతారట. ఈ సినిమాను నేను చేసి ఉంటే అంత మంచి సక్సెస్ నాకు వచ్చేదే అంటూ తన స్నేహితుల దగ్గర తరచూ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటాడట. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవ్వడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. ఏంటి మొదట మంగమ్మగారి మనవడు సినిమాలు చిరు చేయాల్సిందా.. బాలయ్య భలే లక్కీ ఛాన్స్ కొట్టేసాడు అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.