ఎన్టీఆర్‌ను ఆ సినిమా చేయవద్దని కార్ డ్రైవర్ కూడా బ్రతిమాలాడాడా.. రిజ‌ల్ట్ చూస్తే దండం పెడ‌తారు..?

నందమూరి నటసార్వభౌమ తారక రామారావు ఒకసారి కడప జిల్లాలోని సిద్దిపట్నంలో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆశ్రమాన్ని వీక్షించడం కోసం అక్కడికి వెళ్ళడట. అక్కడ ఆయన చెప్పిన కాలజ్ఞానంలో.. తెరపై బొమ్మలే అధికారంలోకి వచ్చి ప్రజలను ఏలుతాయి అన్నమాట ఎన్టీఆర్ ని చాలా ఆకర్షించిందట. అలా ఆయన చెప్పిన కాలజ్ఞానంలో ఎన్నో తత్వాలను చదవగా వీరబ్రహ్మేంద్రస్వామి జీవిత చరిత్రను కచ్చితంగా సినిమా తీసి ప్రేక్షకులకు తెలియజేయాలని ఆలోచన కలిగిందట. ఎప్పుడెప్పుడు ఆ సినిమాను తీద్దామా అని ఆయన ఎంత ఆరాటపడ్డారట. ఉన్నఫలంగా కొండవీటి వెంకటకవి అనే రచయితకు ఫోన్ చేసి కథ సిద్ధం చేయమని ఆదేశించాడట. మూడు గంటల పైన నడివితో ఆ సినిమాను పూర్తి చేశారు.

Pic Of The Day: Sr NTR's Lunch break!

ఇందులో శ్లోకాలు, పద్యాలు అన్నీ కలిసి దాదాపు 25 ఉంటాయి. ప్రతిరోజు షూటింగ్ ప‌నులు దగ్గరుండి ఎన్టీఆర్ చూసుకునేవారట. ఇక ఈ సినిమాను చేయవద్దని.. ఇది ఆడ‌దంటూ అప్పటికే ఎన్టీఆర్‌ను ఎంతో మంది హెచ్చ‌రించార‌ట‌. అలా ఒకరోజు ఎన్టీఆర్ కార్ డ్రైవర్ కూడా తన మనసులో ఉన్న మాటను ఎన్టీఆర్ ముందు బయట పెట్టాడట. డిస్కో, డ్యాన్స్‌లు, యాక్షన్, ఫైట్స్ ఉన్న సినిమాలు వస్తున్న ఈ రోజుల్లో ఇలాంటి సినిమాలు ఎవరు చూస్తారు సార్.. జాగ్రత్తగా దాచి పెట్టుకోవడానికి మాత్రమే సినిమా పనికొస్తుంది.. ఈ సినిమా ఆపేయండి సార్ అంటూ బ్ర‌తిమాలాడ‌ట‌. తీరా సినిమా రిలీజై మొదటి వారంలోనే కోటి రూపాయ‌లు కలెక్షన్లను కలగొట్టింది. ఏకంగా 300 రోజులపాటు వెండితెరపై ప్రదర్శించారు.

Sri Madvirat Veera Brahmendra Swamy Charitra (1984) - IMDb

అప్పట్లో జనాలు ఎంతగా ఈ సినిమాకు భ్రమరధం పట్టారంటే.. అప్పటికే ఎన్టీఆర్‌ను రాముడిగా, కృష్ణుడిగా చూసిన జనం.. నిజంగానే పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఇలాగే ఉండేవారేమో.. అనేంతగా ఆయన నటనను ఆస్వాదించారు. థియేటర్స్ కు వచ్చి మరీ ఎగబడి ఈ సినిమాను చూశారు. ఆయన సినిమాలో వీరబ్రహ్మేంద్రస్వామి ధరించినట్టుగానే చెక్క చెప్పులు ధరించి కనిపిస్తాడు. వీరబ్రహ్మేంద్రస్వామి తన జీవిత చర్మాంకంలో పిల్లలకు ఆ ఆస్తులు అన్నింటిని పంచేసి తర్వాత సన్యాసం తీసుకుని కాషాయ వస్త్రాలు, చెక్కచెప్పులను ధరించి వెళ్లేవాడట. అంతలా వీరబ్రహ్మేంద్రస్వామి క్యారెక్టర్ లో ఎన్టీఆర్ పరకాయ ప్రవేశం చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూసి అన్నగారిని చూస్తే అచ్చం వీరబ్రహ్మేంద్రస్వామిని చూసినట్లే ఉందంటు చర్చించుకున్నారు.