హీరో కాకముందే కృష్ణతో కలిసి నాటకాలు వేసిన మరో స్టార్ హీరో.. ఆయన సినిమాలు ఆడియన్స్‌కు ఎంతో స్పెషల్..?

సినీ ఇండస్ట్రీలో మొదటి తరం నటులంతా నాటకాల నుంచి సినిమాల్లోకి అడుగుపెట్టినవారే కావడం విశేషం. నాటకాలే వారికి గుర్తింపు తెచ్చిపెట్టాయి. అలా ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్, కైకాల సత్యనారాయణ, అల్లు రామలింగయ్య నుంచి ఎంతోమంది నాటకాల ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. వారిలో సూపర్ స్టార్ కృష్ణ కూడా ఒకరు. సినిమాలోకి రాకముందు నాటకాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. నటుడుగా అందర్నీ ఆకట్టుకున్నారు. తర్వాత హీరోగా అవకాశాలను దక్కించుకొని స్టార్‌గా, సూపర్ స్టార్‌గా ఎదిగి ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. 1961 లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కృష్ణ.. 5 దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో రాణించాడు. 350 కి పైగా సినిమాలను నటించాడు.

యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఇలా మ‌ల్టీపుల్ టాస్క్‌లు ప్లే చేసిన కృష్ణ‌.. ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత ఆ స్థాయి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. అయితే కృష్ణ సినిమాల్లోకి రాకముందే మరో సూపర్ స్టార్‌తో కలిసి నాటకాల్లో నటించేవారట. ఆయనతో ఎంతో స్నేహంగా ఉండేవాడట. ఇక ఈయన హీరో అయిన తర్వాత.. ఆయ‌న‌ కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి స్టార్ హీరోగా ఎదిగాడు.. తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరో కాదు.. సోగ్గాడు, టాలీవుడ్ అందగాడు శోభన్ బాబు. ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, కృష్ణంరాజు సినిమాల్లో క్యారెక్టర్ నటిస్తూ మల్టీస్టారర్లు చేస్తూ సోలో హీరో గాను సక్సెస్ అందుకున్నాడు. సూపర్ స్టార్ గా ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు.

Why Mugguru Mongallu Shelved? | cinejosh.com

అప్పటి స్టార్ హీరోలకు దీటుగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించాడు. ఫ్యామిలీ సినిమాలతో లేడీ ఫ్యాన్స్ కు బాగా దగ్గరయ్యాడు. దానికి మించి ఆయన అందం, అభినయంతో సోగ్గాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అభిమానుల గుండెల్లో ఎప్పటికీ ఆ ఇమేజ్ పోకూడదనే ఉద్దేశంతో.. ఓ ఏజ్‌లోనే సినిమాలకు దూరమయ్యాడు. ఇప్పటికీ ఆడియన్స్ లో అలానే ఆయన సోగ్గాడిగా ఉండిపోయాడు. తర్వాత క్యారెక్టర్ ఆర్టిసిగా ఎన్నో అవకాశాలు వచ్చిన శోభన్ బాబు హీరో ఇమేజ్ పోకూడదనే ఉద్దేశంతో ఆ సినిమాలన్నీటికి నో చెప్పేసాడట. అల్లా 2008లో 71 ఏళ్ల వయసులో ఆయన తుది శ్వాస విడిచారు. ఇక సూపర్ స్టార్ కృష్ణ రెండేళ్ల క్రితమే అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. వీళ్లిద్దరు సినీ ఇండస్ట్రీలో ఇప్పటికీ, ఎప్పటికీ స్టార్ హీరోస్ గా ముద్ర వేసుకున్నారు.