బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ ఇండస్ట్రీని ఏ విధంగా కుదిపేస్తుందో మనకు తెలిసిందే. రోజుకో ట్విస్ట్ తో అద్దిరిపోయే షాకులతో ఒక్కొక్క విషయం బయటపడుతుంది . మరి ముఖ్యంగా ఈ రేవ్ పార్టీలో ఎంతమంది టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ పాల్గొన్న హైలెట్ గా నిలిచింది మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేసుకునే హేమ పేరే . అసలు ఆమె ఈ పార్టీకి వెళ్ళలేదు అంటూ చెబుతుంది. కానీ కన్నడ పోలీసులు మాత్రం ఆమె ఈవెంట్ కి వెళ్ళింది అని ప్రూఫ్ తో సహా బయటపెడుతున్నారు .
అంతేకాదు విచారణకు హాజరవ్వాలి అంటూ కన్నడ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నోటీసులు కూడా పంపించారు . అయితే హేమ ఆ కేసు విచారణకు హాజరు అవ్వలేదు . అంతేకాదు సెన్సేషనల్ వీడియోని కూడా రిలీజ్ చేసింది .ఆ వీడియో ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ గా మారింది . ఆ వీడియోలో హేమ మాట్లాడుతూ.. “తప్పు చేయనప్పుడు మనం ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు .. ఒక అబద్ధం చెప్తే ఆ అబద్ధాన్ని తప్పుగా చూపించడానికి మరీ మరీ అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది..
అందుకే ఉన్న విషయం ఉన్నట్లు చెప్తేనే మంచిది . మనమేం దేవుళ్లం కాదు కదా తప్పులు చేస్తూనే ఉంటాం .. అయితే తప్పులు నిజాయితీగా ఒప్పుకోవడం కూడా మంచిది అన్న కోణంలో మాట్లాడి అభిమానులకి ఊహించని కన్ఫ్యూషన్ క్రియేట్ చేసింది”. ప్రెసెంట్ హేమ రిలీజ్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ బెంగుళూరు రేవ్ పార్టీ కేసు హేమకు బాగా ఇబ్బందికర పరిస్థితిలో క్రియేట్ చేసింది అని ఈ వీడియో ద్వారానే అర్థమవుతుంది . చూడాలి మరి దీనిపై నెక్స్ట్ స్టెప్ పోలీసులు ఎలా తీసుకుంటారో..?
“ఒక అబద్ధం చెప్తే దాన్ని కవర్ చేసుకోడానికి 100 అబద్ధాలు ఆడాలి
99% అబద్ధాలు ఆడకుండా ఉండడానికి Try చెయ్యండి
నేను అదే చేస్తాను అందుకే హ్యాపీగా ఉంటాను” – #Hema pic.twitter.com/oqCNTpEMPp
— Daily Culture (@DailyCultureYT) May 27, 2024