రేణూ దేశాయ్ కి మళ్ళీ పవన్ పై ప్రేమ పుట్టిందా..? సెన్సేషనల్ పోస్ట్ వైరల్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్ ఒకప్పుడు భార్యాభర్తలు అన్న విషయం మనందరికీ తెలిసిందే . కొన్ని అనివార్య కారణాల చేత వాళ్ళు విడాకులు తీసుకున్నారు . వాళ్లు కలిసి ఉన్నప్పుడు వాళ్లపై ఎలాంటి వార్తలు వినిపించాయో తెలియదు కానీ వాళ్ళు విడిపోయిన తర్వాత మాత్రం వాళ్లకు సంబంధించిన పుట్టుపూర్వోత్తరాలు లాగడానికి సోషల్ మీడియాలో జనాలు బాగానే ట్రై చేస్తున్నారు . అవసరం ఉన్న అవసరం లేకపోయినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ప్రమోషన్స్ లో ఆయన మూడు పెళ్లిల ప్రస్తావన తీసుకొస్తూనే ఉంటారు కొందరు జనాలు.

అయితే రేణు దేశాయ్ మాత్రం ఎప్పటికప్పుడు వాటిపై ఖండిస్తూనే ఉంటుంది . చాలా పద్ధతిగా తన పని తాను చూసుకునే రేణు దేశాయ్ ను కొందరు పవన్ అభిమానులు సైతం ఏడిపిస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటారు . ఆమె ఏ పోస్ట్ పెట్టిన పరోక్షంగా పవన్ కళ్యాణ్ కి లింక్ పెడుతూ ఉంటారు . ఈ విషయంపై ఎన్నోసార్లు రేణు దేశాయ్ అలా చేయొద్దు అంటూ చెబుతూనే వచ్చింది. అఖీరానందన్ – ఆద్యలతో లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తున్న రేణు దేశాయ్ .. సోషల్ మీడియాలో యమ ఆక్టివ్ గా ఉంటుంది.

రీసెంట్ గా రేణు దేశాయి పెట్టిన పోస్ట్ పవన్ అభిమానులను ఫిదా చేసేసింది . పవన్ కళ్యాణ్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న సినిమాకి సంబంధించిన వీడియో ని షేర్ చేస్తూ..” నేను నమ్మలేకపోతున్నాను ఇది నేనేనా ..?”అంటూ రాసుకొచ్చింది. అంతేనా అక్కడితో ఆగకుండా రెండు లవ్ సింబల్స్ ని కూడా జత చేసింది . దీంతో ఒక్కసారిగా పవన్ ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఫుల్ ఖుషి అవుతూ మళ్లీ మీరు కలవబోతున్నారా ..?అన్న కామెంట్స్ పెడుతున్నారు . మరికొందరు రేణు దేశాయ్ కి మళ్ళీ పవన్ పై ప్రేమ పుట్టిందేమో ..? అంటూ ఘాటుగా కౌంటర్స్ వేస్తున్నారు . ఏమో రేణు దేశాయ్ కి ప్రేమ పుట్టిందో లేదో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ పోస్ట్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది..!