బెంగుళూరు రేవ్ పార్టి మ్యాటర్ ఊహించని ట్వీస్ట్ ఇచ్చిన హేమ.. దెబ్బకి పోలీసుల మైండ్ బ్లాక్..!

బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ కేసు రోజుకో ట్విస్ట్ తో సోషల్ మీడియాని సినిమా ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంది . ఇప్పటివరకు ఎన్నో రేవ్ పార్టీలు జరిగినా ఎప్పుడు కూడా ఈ రేవ్ పార్టీకి జరిగినంత హంగామా జరగనే లేదు . కాగా దాదాపు 100 మందికి పైగా సెలబ్రిటీ లు ఈ పార్టీలో పాల్గొన్నారు..డ్రగ్స్ తీసుకున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది . అంతేకాదు ఈ క్రమంలోనే కొంతమందికి బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నోటీసులు కూడా పంపించారు.

టాలీవుడ్ నటి హేమ తో పాటు మరో ఎనిమిది మందికి నోటీసులు పంపించి కేసు విచారణకు హాజరు కావాలి అంటూ ఆర్డర్ వేశారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. కేసు విచారణకు హాజరయ్యేందుకు కొంతమంది అటెండ్ అవ్వగా మరి కొంత మంది మాత్రం అటెండ్ అవ్వలేదు. మరీ ముఖ్యంగా హేమ నోటీసులు అందుకున్న కూడా బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ కు వెళ్లలేదు . తాను వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నట్లు ఓ లేఖలో పేర్కొంది .

అయితే హేమ రాసిన లేఖను సిసిసిబి పోలీసులు పరిగణలోకి తీసుకోలేదు. ఈ నేపథ్యంలోనే విచారణకు హాజరు కావాలి అంటూ మరొకసారి నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది అన్న వార్త కన్నడ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . సుమారు 150 మంది ఈ పార్టీలో పాల్గొనగా 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు బ్లడ్ శాంపిల్స్ లో పాజిటివ్ వచ్చిందని పోలీసులు చెప్తున్నారు. అయితే పలువురు ఈ పార్టీకి వెళ్ళని వాళ్ళ పేర్లు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉండడం వాళ్ళ కుటుంబాలకి ఇబ్బందికరంగా మారింది. మరీ ముఖ్యంగా ఈ పార్టీకి ఎంతోమంది హాజరవ్వగా హేమ పేరు హైలెట్గా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉండడం టాలీవుడ్ సినీ వర్గాలలో హాట్ హాట్ గా వైరల్ గా మారింది..!!