తెలుగు సినిమా నుంచే ఆ విషయాలు నేర్చుకున్నా.. సంయుక్త మీన‌న్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..?!

బాలీవుడ్ లో అడుగు పెడుతున్న ప్రజెంట్ హీరోయిన్ల లిస్టులో సంయుక్త మీనన్‌ కూడా చేరిపోయింది. ఇటీవల కాలంలో సౌత్ బ్యూటీస్ హిందీ సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వరుసలో సంయుక్తా కూడా యాడ్ అయిపోయింది. తెలుగులో గోల్డెన్ లెగ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సంయుక్త ఈమె నటించిన ప్రతి సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర ఎంచుకుంటూ మంచి పేరు తెచ్చుకుంది.

హిందీలో చేస్తున్న మొదటి సినిమా విషయంలోనూ తనదైన స్టైల్ ఫాలో అవుతుంది ఈ చిన్న‌ది. స్టార్ హీరోల సరసన కాకుండా ఓ కీల‌క పాత్రను సెలెక్ట్ చేసుకుని అక్కడ తన సత్తా చాటుకున్నే ప్ర‌య‌త్నాలు చేస్తుంది. ప్రభుదేవా, కాజోల్ ప్ర‌ధాన‌ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో సంయుక్తమీన‌న్‌ బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది. ఈ మూవీ తోనే టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ చరణ్ తేజ్ ఉప్పలపాటి డబ్ల్యూ డైరెక్టర్గా ఇంటర్వ్యూ ఇవ్వనున్నాడు.

Kajol Set To Perform Action Sequences In Upcoming Film With Prabhu Deva,  Confirms Director

ఈ క్రమంలో సంయుక్త ఓ ఇంటర్వ్యూలో పాల్గొని టాలీవుడ్ ఇండస్ట్రీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఈమె మాట్లాడుతూ.. మూసా పద్ధతులను పక్కన పెట్టేసి ప్రయాణించడమే నా అలవాటు అంటూ చెప్సిన‌ సంయుక్త.. ఏ భాషలోకి వెళ్లినా అక్కడ పరిస్థితులను అర్థం చేసుకొని.. పని విషయంలో ఆ పద్ధతులను ఫాలో అవ్వడం అలవాటు చేసుకున్న అంటూ చెప్పుకొచ్చింది. అది తెలుగు సినిమా నుంచే నేను నేర్చుకున్న అంటూ కామెంట్స్ చేసింది. పఇక ప్ర‌స్తుతం టాలీవుడ్‌ను ఉద్దేశిస్తూ చేసిన ఈ కామెంట్స్‌ వైరల్ అవుతున్నాయి.