ఆ రూమర్ నే నిజం చేయబోతున్న రామ్ చరణ్.. మెగా ఫ్యాన్స్ గెట్ రెడీ రా అబ్బాయిలు..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రూమర్స్ అనేటివి ఎక్కువగా వినిపిస్తున్నాయి . మరి ముఖ్యంగా సోషల్ మీడియాలో అలా వైరల్ అయ్యే ప్రతి వార్త రూమర్ అని కొట్టి పడేయ లేకపోతున్నాం. ఎందుకంటే అలా రూమర్ అయిన ప్రతి వార్త కూడా తర్వాత పక్క రోజు నిజం అవుతూ ఉండడం గమనార్హం . స్టార్ సెలబ్రెటీస్ విషయంలో ఇవి ఎక్కువగా చూస్తున్నాము. తాజాగా సినిమా ఇండస్ట్రీలో ఒక న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రామ్ చరణ్ ప్రజెంట్ గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు .

దానంతటకీ కారణం రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు . రీసెంట్ గా రామ్ చరణ్ – కాజల్ కోసం అభిమానులను కలవబోతున్నాడు అన్న వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన కాజల్ అగర్వాల్ తనదైన స్టైల్ లో దూసుకుపోతుంది. అంతేకాదు రీసెంట్గా నటించిన సినిమా సత్యభామ ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్ కు బాలకృష్ణ – అనిల్ రావిపూడి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు .

కాగా ఇప్పుడు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఏకంగా గ్లోబల్ స్టార్ ని రంగంలోకి దింపుతుందట కాజల్ అగర్వాల్. ప్రజెంట్ ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. కాజల్ అగర్వాల్ – రామ్ చరణ్ ఎంత మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అనే విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. వాళ్లకు సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటాయి . కాగా కాజల్ కోసం రామ్ చరణ్ సత్యభామ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి రావడానికి అంగీకరించారట . త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా రాబోతుందట . ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!