అభిమానులకి సడెన్ సర్ప్రైజ్ ఇచ్చిన సుకుమార్.. పుష్ప 2 నుండి బ్లాస్టింగ్ అప్డేట్ వచ్చేసిందోచ్..!

సుకుమార్ ఎంతమంది డైరెక్టర్స్ ఉన్న ఈ డైరెక్టర్ పేరు చెప్తే జనాలు ఓ రేంజ్ లో ఊగిపోతూ ఉంటారు . దానికి కారణం ఆయన కమిట్మెంట్ .. ఆయన అందరిలాగే సినిమాలను తెరకెక్కిస్తారు.. కానీ ఫ్యాన్స్ కి ఎలాంటి సినిమాలు నచ్చుతాయి ..? ఎలాంటి సినిమాలను ఎంజాయ్ చేస్తారు..? అన్న విషయంగా ఆలోచించి అటువంటి సినిమాలనే తెరకెక్కిస్తాడు.. ఇప్పటివరకు సుకుమార్ తెరకెక్కించిన సినిమాలు చూస్తే ఆ విషయం మనకు ఇట్టే క్లియర్గా అర్థం అయిపోతుంది.

కాగా రీసెంట్గా సుకుమార్ తెరకెక్కిస్తున్న సినిమా పుష్ప2 బన్నీ హీరోగా రష్మిక మందన్నా.. హీరోయిన్గా ఈ సినిమాలో నటిస్తున్నారు . అంతేకాదు పలువురు నటీనటులు కీలకపాత్రలో నటించి మెప్పించబోతున్నారు. ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పట్టుకొని ఉన్నారు జనాభా . అంతే కాదు ఈ సినిమా కోసం బన్నీ తీవ్రస్థాయిలో కష్టపడుతున్నారు . కాగా ఈ సినిమా నుంచి ఇప్పటికే పుష్ప పుష్ప పుష్ప అంటూ ఒక సాంగ్ రిలీజ్ అయింది . అయితే త్వరలోనే శ్రీవల్లికి సంబంధించిన సాంగ్ రాబోతుంది అంటూ వార్తలు వినిపించాయి .

ఇప్పుడు ఆ వార్తలు అఫీషియల్ గా బయటపడ్డాయి. రేపు 11:07 నిమిషాలకు శ్రీవల్లి సాంగ్ రాబోతుంది అంటూ పుష్ప2 టీం సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది . దీనితో ఒక్కసారిగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు . అయితే రష్మిక మందన్నా బలవంతం చేయడం కారణంగానే సుకుమార్ ఈ స్టెప్ తీసుకున్నారట . పుష్ప2 అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి రష్మిక పేరు వినిపిస్తుంది . కానీ ఎక్కడ మారుమ్రోగిపోలేదు. ఆ కారణంగానే రష్మిక తీవ్రంగా హర్ట్ అయిందట. బలవంతంగా సుకుమార్ చేత తన సాంగ్ అప్డేట్ ఇప్పించుకుంటుందట. మొత్తానికి అనుకున్నంత పని సాధించింది రష్మిక మందన్నా అంటూ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు..!!