అసలు రేవ్ పార్టీలో జరిగింది ఇదే.. సెన్సేషనల్ విషయాని బయట పెట్టిన యాంకర్ శ్యామలా..!

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే బెంగళూరు నగర శివారులో జరిగిన రేవ్ పార్టీకి సంబంధించిన వార్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఈ పార్టీలో 100 మందికి పైగా టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ హాజరై డ్రగ్స్ తీసుకున్నట్లు కన్నడ పోలీసుల విచారణలో బయటపడడం సంచలనంగా మారింది .అంతేకాదు ఏపీకి సంబంధించిన పలు రాజకీయ నేతలు కూడా ఈ పార్టీలో పాల్గొన్నారు. అంతేకాదు వైసిపి పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే కూడా ఆ పార్టీలో పాల్గొన్నారట. ఆ వైసీపీ ఎమ్మెల్యేకి సంబంధించిన కారును కూడా సీజ్ చేసినట్లు కన్నడ పోలీసుల విచారణలో బయటపడింది .

అంతేకాదు ఎమ్మెల్యే కారులో ప్రముఖ టాలీవుడ్ యాంకర్ కూడా ఉన్నట్లు తెగ వార్తల ఓ రేంజ్ లో ఊపూందుకున్నాయి. అయితే కొంతమంది ఆ తెలుగు యాంకర్ శ్యామలానే అంటూ ప్రచారం చేశారు . ఆమె పేరుని దుష్ప్రచారం చేస్తూ పలు వల్గర్ కామెంట్స్ తో అసభ్యకరంగా మాట్లాడారు. దీంతో యాంకర్ శ్యామల అలాంటి వార్తలపై సీరియస్ అయింది . “ఎందుకు నన్ను ఇలా దిగజారుస్తున్నారు..? అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి ..?ఎక్కడ జరిగింది..? నేను అసలు బెంగళూరు కే వెళ్ళలేదు ..? మరి రేవ్ పార్టీలో నేనున్నాను అంటూ ఎలా ప్రచారం చేస్తారు ..?”

“ఒక పార్టీకి సపోర్ట్ చేసినంతమాత్రాన నా కెరియర్ పరంగా దెబ్బతీస్తారా ..? ఇది న్యాయమేనా..? అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయిపోయింది . అంతేకాదు నాకు ఆ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు అంటూ తేల్చేసింది . దీంతో యాంకర్ శ్యామల మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి . అయితే ఆ యాంకర్ శ్యామల కానప్పుడు మరి ఏ యాంకర్ అంటూ జనాలకు కొత్త డౌట్లు మొదలయ్యాయి . మనకు తెలిసిందే రీసెంట్గా జరిగిన ఎన్నికల్లో యాంకర్ శ్యామల వైసిపి పార్టీకి సపోర్ట్ చేసింది . ఆ టైంలో ఆమెను హ్యూజ్ ట్రోలింగ్ కూడా చేశారు..!!