వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రి టైర్మెంట్ ప్రకటించనున్నారంటూ.. వైసీపీలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. వచ్చే ఎన్నికల నాటికి.. ఆ యన రిటైర్ కానున్నారని ఆయన ప్లేస్‌లో ఆయన కోడలు రాజకీయ అరంగేట్రం చేయనున్నారని కూడా వైసీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే.. దీనికి అధికార ముద్ర ఏమీ లేదు. చిత్తూరు జిల్లాకు చెందిన కొందరు నేతలు కూడా ఇదే చెబుతున్నారు.

అయితే.. ఇది వాస్తవమా? లేక పుకారా? అనేది తెలియాల్సి ఉంది. వాస్తవానికి సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్న పెద్దిరెడ్డి మంత్రి పదవులు కూడా చేశారు. అయితే.. 2024లో ఆయన గెలిచినా పార్టీ ఓటమిపాలవ డం. సభకు కూడా రాలేని పరిస్థితి ఎదురవడంతో పెద్దిరెడ్డి మానసికంగా ఒకింత ఇబ్బంది పడుతున్నారు. ఇంత సీనియర్ అయి ఉండి కూడా.. అంటూ ఆయన పార్టీలో తన అనుచరుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా.. ఆయన మనసులోనే బాధపడుతున్నారని తెలిసింది.
ముఖ్యంగా రెండు కీలక విషయాలపై పెద్దిరెడ్డి అంతర్మథనం చెబుతున్నారు. ఇది పార్టీలోనూ నాయకు లు చెబుతున్న మాట. సీనియర్ అయినప్పటికీ.. తన మాటను ఎవరూ పట్టించుకోవడం లేదన్నది ఆయ న వాదన. ప్రధాన ప్రతిపక్షంతో సంబంధం లేకుండా.. సభకు వెళ్లాలని.. అధికార పార్టీ ప్రజా వ్యతిరేక విధా నాలను ప్రశ్నించాలన్నది పెద్దిరెడ్డి ఆలోచన. కానీ.. ఈ విషయంలో జగన్ ఇప్పటకే నిర్ణయం తీసుకున్నా రు. ఇక, నియోజకవర్గంలోనూ పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది.

కేసులపై కేసులు వెంటాడుతున్నాయి. ప్రస్తుతం కొంత ఉపశమనం పొందినా.. పార్టీ పరంగా పుంజుకుంటే మాత్రం కేసులు మరోసారి తెరమీదికి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీకి కూడా పెద్దిరెడ్డి అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఇక, వచ్చే ఎన్నికల నాటికి తన వయసు కూడా 75 +కు చేరుతుంది కాబట్టి.. ఇంక కొనసాగడం మంచిదికాదని ఆయన భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే మిథున్ రెడ్డి సతీమణిని పుంగనూరు నుంచి బరిలోకి దింపాలని భావిస్తున్నట్టు తెలిపాయి. అయితే.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

