నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ డెబ్యూ కోసం అటు నందమూరి అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. ఆయన సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి రంగం సిద్ధమైందని తెలుస్తుంది. బాలయ్య కెరీర్‌లోనే మైల్డ్ స్టోన్‌గా నిలిచిపోయిన టైం ట్రావెలింగ్ సైన్స్ ఫిక్షన్ క్లాసిక్.. ఆదిత్య 369 సీక్వెల్‌గా ఆదిత్య 999 మ్యాక్స్ రూపొందనుందని.. ఈ సినిమాతో ఆడియన్స్‌కు మోక్షజ్ఞ పరిచయం కాబోతున్నారని సమాచారం. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు క్రిష్ జాగర్లమూడి దర్శకుడుగా వ్యవహరించినన్నారు. ఇప్పటికే ప్రాజెక్టుకు సంబంధించిన స్క్రిప్ట్ పనులన్నీ కంప్లీట్ అయ్యాయని.. ప్రీ ప్రొడక్షన్ పనులను టీం సరవేగంగా జరుపుతున్నట్లు సమాచారం.
సాయి మాధవ్ బుర్ర పవర్ ఫుల్ డైలాగ్స్‌తో సినిమా రూపొందునుందట. ఇక మోక్షజ్ఞ ఎంట్రీ అదిరిపోయేలా బాలయ్య ఇప్పటికే స్పెషల్ ఫోకస్ చేస్తున్నాడట. మోక్షజ్ఞ సైతం సినిమాలో చాలా స్టైలిష్ ట్రెండీ లుక్‌లో కనిపించనున్నాడని.. దీనికోసం ఆయన స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో బాలయ్య, మోక్షజ్ఞ మాత్రమే కాదు.. మరి కొంతమంది స్టార్ సెలబ్రిటీస్ మెరవనున్నారట. అంతేకాదు.. టైం ట్రావెలింగ్ కాన్సెప్ట్ కావడంతో.. విజువల్ ఎఫెక్ట్స్, భారీ సెట్టింగ్స్ విషయంలోనూ ఎక్కడ టీం రాజీ పడకూడదని ప్లాన్ చేస్తున్నారు.
మోక్షజ్ఞ ఎంట్రీ బాలయ్య పక్క ప్లానింగ్ తో ఉన్నాడు. ఈ విషయంపై గతంలోనే మాట్లాడుతూ.. మోక్షజ్ఞను ఎలా ఇంట్రడ్యూస్ చేయాలో నాకు బాగా తెలుసు.. అతని కోసం నా దగ్గర 5,6 స్క్రిప్టులు రెడీగా ఉన్నాయి అంటూ ధీమా వ్యక్తం చేశాడు. చివరకు ఆదిత్య 369 సీక్వెల్ ను బాలయ్య ఫిక్స్ చేయడం అభిమానులకు సైతం ఆనందాన్ని కలిగిస్తుంది. కారణం ఈ సినిమా ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ చరిత్రలోనే డిఫరెంట్ అటెంప్ట్. ఇక ఈ ఏడాదిలోనే సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని.. వచ్చే ఏడాది సినిమాను సెట్స్‌పైకి తీసుకువెళ్లేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.



