టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మన శంకర వరప్రసాద్ గారు సినిమా పనుల్లో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు టీం సన్నాహాలు చేస్తున్నారు. ఫ్యామిలీ, కామెడీ సినిమా ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతోంది. ఇక.. ఈ మూవీలో.. నయనతార హీరోయిన్గా నటిస్తుండగా.. వెంకటేష్ మరొ కీలక పాత్రలో మెరవనున్నారు. దానికి తగ్గట్టుగానే.. సినిమా నుంచి ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్ దక్కించుకుంటుంది. దీంతో.. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక.. ఈ సినిమా తర్వాత.. చిరంజీవి, డైరెక్టర్ బాబి కొల్లితో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఓ అప్డేట్ వైరల్ గా మారుతుంది. గతంలో వాల్తేరు వీరయ్య సినిమాతో సూపర్ హిట్ కొట్టిన ఈ కాంబో.. మళ్లీ రిపీట్ అవుతున్న క్రమంలో.. ఆడియన్స్‌లోను మంచి హైప్ మొదలైంది. ఇక తాజాగా సినిమా నుంచి రిలీజ్ అయిన కాన్సెప్ట్, పోస్టర్స్ సైతం ఆసక్తిని కోల్పిస్తున్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరో ఇంటరెస్టింగ్ అప్డేట్ ఏంటంటే.. చిరంజీవి తో పాటు ఇంకో స్టార్ హీరో సినిమాలో కీలక పాత్రలో మెరవనున్నారట.
మొదట తమిళ్ హీరో కార్తీ పేరు వినిపించినా.. ఇప్పుడు మాత్రం మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ చిరంజీవితో కలిసి ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడని టాక్ వైరల్ గా మారుతుంది. దీనిపై అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది. అయితే.. ఇప్పటికే న్యూస్ వైరల్ గా మారడంతో.. మెగా ఫ్యాన్స్ ఆనందాని వ్యక్తం చేస్తున్నారు. వీళ్లిద్దరి కాంబోలో.. నిజంగా ఓ సినిమా వస్తే.. కచ్చితంగా బాక్సాఫీస్ బ్లాస్ట్ అవుతుంది అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇది చిరంజీవి కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా రూపొందునుంది. ఇక సినిమా రెగ్యులర్ షూట్ 2026 లో ప్రారంభం కానుందని సమాచారం.

