రాజాసాబ్.. రన్ టైం, పార్ట్ 2 పై మారుతి ఇంట్రెస్టింగ్ క్లారిటీ..!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. మారుతి డైరెక్షన్‌లో రూపొందిన తాజా మూవీ రాజాసాబ్‌. ఈ సినిమా నుంచి కొద్ది గంటల క్రితం టీజర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక.. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో సినిమాకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్న మారుతి.. సినిమా రన్ టైం గురించి క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు.. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందా.. లేదా.. అనే విషయాన్ని కూడా ఆయన అభిమానులతో పంచుకున్నాడు. ప్రభాస్‌తో మొదటిసారి ఈ జోనర్‌లో సినిమా తీశారు. మీ అభిప్రాయం ఏంటని ప్రశ్నించగా.. దానిపై రియాక్ట్ అవుతూ.. ప్రభాస్‌కు గతంలో కామెడీ తరహా సినిమాలు ఉన్నాయి. కామెడీలో ఆయనకంటూ ఒక్క స్పెషల్ టైమింగ్ ఉంది.

Prabhas' The Raja Saab: Stylish New Poster Unveiled Ahead of Grand Teaser  Launch

దాన్ని పాన్ ఇండియాకు చూపించాలని భావించా.. ఈ సినిమాతో అదే చేశా.. ఇక ప్రభాస్ సినిమా అంటే రేంజ్ కు తగ్గట్లు ఉండాలిగా.. అందుకే గ్రాండ్ లెవెల్ లో సెట్స్ నిర్మించామంటూ చెప్పుకొచ్చాడు. ప్రభాస్‌తో సినిమా చేయడం పై తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటూ.. ప్రభాస్ దర్శకుల హీరో అని.. దర్శకులు ఏం కోరుకుంటే అదే విధంగా చూపిస్తాడని.. ఆ పాత్రలో ఒదిగిపోతాడు అంటూ వివ‌రించాడు. ఈ మూవీ షూట్ టైం లో ఎప్పుడైనా స్ట్రెస్ ఫీల్ అయ్యారా అని అడగగా.. అసలు అలాంటిది లేదు. నేను ఆయనకు డై హార్ట్ ఫ్యాన్.. ఓ అభిమానిగా నా హీరోని ఎలా చూడాలనుకున్నానో.. అలాగే చూపించాను అంటూ వివరించాడు. ఇక సినిమా రన్ టైం పై ప్రశ్న ఎదురు కాగా మారుతి.. మూడు గంటల సినిమా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు.

The Raja Saab Movie: Showtimes, Review, Songs, Trailer, Posters, News &  Videos | eTimes

ఈ సినిమాకు పార్ట్ 2 ఉంటుందా అనే ప్రశ్నకు సినిమా పూర్తయిపోయాక దాని గురించి ఆలోచిస్తాం. అలా అని పార్ట్ 2 కోసం బలవంతంగా కథను సాగదీసి జనాలపై రుద్దే ఛాన్స్ మాత్రం లేదు.. కంగారు పడొద్దు. ఆ క్లారిటీ మాకు ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక.. సాధారణంగా నటీనటులు సినిమా కోసం ఎనిమిది గంటల షిఫ్ట్ అనేది చేస్తూ ఉంటారు. కానీ.. ఈ సినిమా కోసం మా టీం 18 గంటలు కూడా వర్క్ చేసిన సందర్భం ఉంది. అందుకే సినిమాకు మంచి ఔట్పుట్ వచ్చిందని.. ఆడియన్స్ అంచనాలను మించిపోయేలా కచ్చితంగా సినిమా ఆకట్టుకుంటుంది అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మారుతి చేసిన కామెంట్స్‌ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి.