టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులంతా ఇప్పుడిప్పుడే అంటు కళ్ళు కాయలు కాచేలు ఎదురుచూసిన సందర్భం ఎట్టకేలకు వచ్చేసింది. మరో 11 రోజుల్లో పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ఆడియన్స్ ముందుకు రానున్న సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత పవన్ నుంచి వస్తున్న సినిమా కావడం.. అది కూడా ఏపీ డిప్యూటీ సీఎం గా పవన్ బిజీగా రాణిస్తున్న క్రమంలో ఈ సినిమా రిలీజ్ అవుతుండడంతో.. సినిమాపై ఆడియన్స్‌లో మరింత ఆసక్తి మొదలైంది. కేవలం అభిమానులే కాదు.. సాధారణ ఆడియన్స్ సైతం ఈ సినిమా చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి క్రమంలో సినిమా ఫ్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ఇండస్ట్రీలో సంచాలనంగా మారింది.
ఈ సినిమాకు నిర్మాత ఎంఎం రత్నం ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. దాదాపు 300 కోట్లకు పైగా బడ్జెట్ను కేటాయించి ఈ సినిమాలో తెరకెక్కించాడు. ఈ క్రమంలోనే దానకి తగ్గట్టే ఫ్రీ థియేట్రికల్ బిజినెస్ విషయంలోనూ అస్సలు కాంప్రమైస్ కావడం లేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సినిమా నైజాం హక్కులను ఏకంగా రూ.60 కోట్లకు అమ్మాలని భావిస్తున్నాడట.. అంత ఇచ్చేందుకు బయ్యర్స్ ఎవరు సిద్ధంగా లేకపోవడంతో.. రూ.45 కోట్ల అడ్వాన్స్ బేసిస్ పై సినిమా హక్కులు మైత్రి మేకర్స్ సొంతం చేసుకున్నట్లు టాక్ నడుస్తోంది. అంటే.. రూ.45 కోట్ల షేర్ తర్వాత వచ్చిన అమౌంట్ నుంచి మాత్రమే మిగతా మొత్తం ఏ.ఏం. రత్నం అకౌంట్లోకి వెళ్తుందట. కేవలం నైజం లోనే కాదు.. అన్ని ప్రాంతాల్లోనూ ఇదే అడ్వాన్స్ బేసిస్ మెథడ్ ను ఏం రత్నం ఫాలో అవుతున్నట్లు సమాచారం.
ఇక సీడెడ్‌లో సినిమా బిజినెస్ రూ.25 నుంచి 30 కోట్లు డిమాండ్ చేయగా.. బయర్లు సాహసం చేయలేకపోవడంతో.. రూ.20 కోట్ల అడ్వాన్స్ బేసిస్ పై సీడెడ్ డీల్ క్లోజ్ చేసినట్లు సమాచారం. ఓవరాల్‌గా రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.170 కోట్ల బిజినెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. బయర్స్ రూ.130 కోట్ల అడ్వాన్స్ ఇచ్చేందుకు మాత్రమే సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలోనే రేపటిలో పూర్తి డీల్స్ క్లోజ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. అలాగే ఓవరాల్ గా అన్ని ప్రాంతాల్లో కలిపి సినిమాకు రూ.200 కోట్ల థియేటర్ బిజినెస్ జరిగినట్లు టాక్ నడుస్తుంది. అంటే.. సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే కచ్చితంగా రూ.200 కోట్ల షేర్ అందుకోవాల్సిందే. సినిమా రిలీజ్ ఐ ఫస్ట్ షో తో పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే మొదటి వారంలోని సినిమా ఈజీగా బ్రేక్ ఈవెన్ అవుతుంది అనడంలో అతిశయోక్తి లేదు.