ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సక్సెస్ సాధించడమంటే సాధారణ విషయం కాదు ఈ క్రమంలోనే ఎన్నో సమస్యలు, అవమానాల తర్వాత ఇండస్ట్రీలో సక్సెస్ సాధించి స్టార్ సెలబ్రేటీలుగా మారిన తర్వాత.. వాళ్లకి వచ్చిన స్టార్‌డ్ రిత్యా రోజురోజుకు డిమాండ్‌ను అంతకంతకు పంచుకుంటూ పోతున్నారు. ఒక్కొక్కరు వారి నటనకు కోట్లలో సైతం చార్జ్ చేస్తున్నారు. హీరోయిన్స్, స్పెషల్ సాంగ్స్ లోను నటిస్తూ కోట్లల్లో చార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఈ పై ఫోటోలో చూస్తున్న ముద్దుగుమ్మ కూడా అదే కోవకు చెందుతుంది. ప్రస్తుతం కోట్లల్లో రెమ్యనరేషన్ అందుకుంటూ దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ ఎవరు గుర్తుపట్టారా..?
తన అందంతో దేశాన్ని షేక్ చేసేస్తున్న ఈ హాట్ బ్యూటీ.. డ్యాన్స్‌లో తోప్ సెలబ్రిటీ. స్టేజ్‌పై డ్యాన్స్ వేసిందంటే చాలు.. ఆడియన్స్‌లో విజిల్స్ మోత మోగిపోవాల్సిందే. ఇక రెబల్ స్టార్ ప్రభాస్‌తోను ఆడిపాడిన ఈ హీరోయిన్ ఎవరో కాదు.. నోరా ఫతేహి. బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం తనదైన ముద్ర వేసుకొని దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ.. దేశవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది. స్పెషల్ సాంగ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఈ ముద్దుగుమ్మ.. ఎక్కడ ఉన్నా ఆ వైబ్స్ పీక్స్ లెవెల్ లో ఉంటాయన్నడంలో అతిశయోక్తి లేదు.
ఇక ఈ అమ్మడు ఇండస్ట్రీలోకి రాకముందు ఎన్నో సమస్యలు, సవాళ్లు ఎదుర్కొంది. ఎన్నో ప్రయత్నాలు తర్వాత ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి సక్సెస్ సాధించింది. కెనడా నుంచి కేవలం 5000 తో ఇండియాలో అడుగుపెట్టిన నోరా ఫతేకి.. అవకాశాల కోసం చెప్పులరిగేలా తిరిగిన ఒక్క ఛాన్స్ అందుకోలేక పోయిందట. కడుపునిండా తిండి కూడా తినలేదని.. ఒక గుడ్డు, ఒక్క బ్రెడ్ మాత్రమే తిని రోజంతా సర్దుకునేతాన్ని అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఇప్పుడు ఆమె ఓ స్టార్ సెలబ్రిటీ. ఒక్క స్పెషల్ సాంగ్‌లో ఐదు నిమిషాలు నటించినందుకు.. రూ. 2కోట్లు చార్జ్ చేస్తూ.. లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తుంది. ఇక ప్రస్తుతం అమ్మడి ఆస్తులు విలువ రూ.50+ కోట్లని సమాచారం.
View this post on Instagram