ఈ ఏడాది సమ్మర్ సీజన్ పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలతో కళకళలాడిపోతుందని అంత భావించారు. కానీ.. ఊహించిన రేంజ్‌లో కనీసం ఒక సినిమా రిలీజ్ కాకుండా వాయిదా పడుతూ వచ్చాయి. అంతేకాదు.. అడపా దడపా సినిమాలు రిలీజ్ అయినా ఒక్కటి కూడా సరైన సక్సెస్ అందుకోలేదు. ఇలాంటి క్రమంలో ప్రస్తుతం సమ్మర్ సీజన్ కు మిగిలిన ఏకైక పెద్ద హోప్ కింగ్‌డమ్. విజయ్ దేవరకొండ అభిమానులకే కాదు.. మొత్తం టాలీవుడ్‌కే ఈ సినిమా బిగ్ హోప్ గా నిలిచింది. ఇటీవల నేచురల్ స్టార్ నాని హిట్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నా.. థియేటర్లను ఈ సినిమా మరో నాలుగు రోజుల వరకు మాత్రమే బలంగా ఆపుతుంది. తర్వాత థియేటర్లు ఎక్కువగా కేటాయించలేరు.
ముందే థియేటర్లు ఎలాగో తగ్గించేస్తారు. రెండో వారం రెండు చిన్న చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటిని ఎలాగూ ఎక్కువ స్క్రీన్ లో రిలీజ్ చేయరు. మళ్లీ కింగ్డమ్ వచ్చేవరకు ఒక్క సరైన సినిమా కూడా టాలీవుడ్ లో లేదు. కానీ.. ఇలాంటి పరిస్థితుల్లో రౌడీ స్టార్‌ను.. పవర్ స్టార్ ఇరకాటంలో పడేసాడంటూ టాక్ వైరల్ గా మారుతుంది. అసలు కింగ్‌డమ్ సమ్మర్‌లో వస్తుందా.. లేదా.. అని అనుమానాలు మొదలయ్యాయి. దానికి కారణం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా. ఈ సినిమాను మే 30లో రిలీజ్ చేయాలని టీం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. పవన్ కూడా తన బ్యాలెన్స్ నాలుగు రోజుల వర్క్‌ను కూడా పూర్తి చేసేస్తున్నాడు. కచ్చితంగా మే 30న ఈ సినిమా వచ్చేస్తుందని నిర్మాత ఏం రత్నం వెల్లడించారు.
ఈ మేరకు కింగ్‌డమ్‌తో నిర్మాణ బంధాలు ఉన్న త్రివిక్రమ్ కు సమాచారం అందిందట. ఈ క్రమంలోని హరిహర వీరమల్లు వస్తే కచ్చితంగా కింగ్‌డమ్‌కు బ్రేక్ పడిపోవాలి. అలా అని వెనక్కి వెళ్లే అవకాశం లేదు. కారణం దాని నెక్స్ట్ వీక్ లో కమలహాసన్ నుంచి థగ్ లైఫ్ రిలీజ్ అవుతుంది. ఇప్పటికే చాలాసార్లు జరిగినట్లు.. మరోసారి హరిహర వీరమల్లు వెనక్కి తగ్గే సమస్య లేదు. దీంతో.. కింగ్‌డమ్‌కు వీరమల్లు పెద్ద సమస్యగా మారబోతుంది. జూన్ రెండో వారం.. లేదా మొదటి వారంకు కింగ్‌డమ్ వాయిదా వేయక తప్పదు. ఇలాంటి పరిస్థితుల్లో రౌడీ సార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో.. పవన్ కు ఎదురెళ్లి పోటీకి సిద్ధమవుతాడా.. లేదా వెనక్కు తగ్గుతాడా వేచి చూడాలి.vx