బుల్లితెర క్రేజీ కపుల్.. సుధీర్, రష్మిల మధ్య గొడవలా..ఏం జరిగిందంటే..?

తెలుగు బుల్లితెరపై రీల్ కపుల్ గా భారీ పాపులారిటీ దక్కించుకున్నారు సుధీర్, రష్మీ. ఇక వీళ్ళి ద్దరి క్రేజీ లవ్ ట్రాక్‌కు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనడంలో అతి శ‌యోక్తి లేదు. జబర్దస్త్‌తో ఎన్నో స్కిట్లు చేసి పాపులారిటీ దక్కించుకున్న ఈ బుల్లితెర బెస్ట్ కపుల్.. స్క్రీన్ పై కనిపిస్తే చాలు ఆడియన్స్ లో జోరు వేరే లెవెల్ లో ఉంటుంది. కాగా వీరిద్దరి మధ్య కొన్నేళ్లుగా సంథింగ్ సంథింగ్ నడుస్తుంది అంటూ ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి. దానికి తగ్గట్టుగానే వీరు చేసే షోలలోను కెమిస్ట్రీని అంతకంతకు పెంచుకుంటూ పోయారు. కానీ.. వీరిద్దరు పర్సనల్ లైఫ్ లో మాత్రం తమ మధ్య ఎలాంటి రిలేషన్‌షిప్ లేదని.. కేవలం స్నేహితుల మాత్రమే అంటూ తెలియజేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

Actor Sudigali Sudheer's Comments On Rashmi Gautam Viral, Spark  Relationship Speculations - News18

అయితే.. తాజాగా రష్మీ, సుడిగాలి సుదీర్ మధ్య గొడవలు తలెత్తాయని టాక్ వైరల్‌గా మారుతుంది. వీటిపై తాజాగా యాంకర్ రష్మీ రియాక్ట్ అయింది. జబర్దస్త్ షోకు యాంకర్ గా వచ్చినప్పటి నుంచి సుధీర్ కి.. రష్మితో మంచి బాండ్ ఉంది. అలా ఓ వైపు సినిమాల్లో ఆకట్టుకుంటేనే.. మరోవైపు జబర్దస్త్ మెప్పించిన రష్మి.. సుడిగాలి సుదీర్తో కలిసి కామెడీ షోలలో మెరిసింది. సుధీర్.. కమెడియన్ గా మంచి పొజిషన్‌కు చేరుకున్న తర్వాత రష్మిని ప్రేమించాడంటూ వార్తలు ఎన్నో వైరల్గా మారాయి. అయితే వీరిద్దరి ఆన్ స్క్రీనే కాదు.. ఆఫ్ స్క్రీన్ బాండ్ కూడా అందరినీ ఆకట్టుకునేది.

sudheer rashmi❤️❤️ (@Vaishu328836204) / X

అయితే.. ఇటీవల కాలంలో రష్మితో సుధీర్‌కు జరిగిన గొడవల కారణంగానే.. ఆయన బుల్లితెరపై పెద్దగా కనిపించడం లేదంటూ వార్తలు వినిపించాయి. ఇలాంటి తరుణంలో.. రష్మీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సుధీర్‌కి నాకు.. అసలు ఎలాంటి గొడవలేదని.. మా మధ్య వచ్చే రూమర్లని అసలు మేము పట్టించుకోము అంటూ వివరించింది. మేము ఏదైనా ఈవెంట్లో కలుస్తూ ఉంటామని చెప్పుకొచ్చింది. అలా.. అందరం కూడా ఒకే దగ్గర పని చేయాల్సి ఉంటుంది. కనుక.. మా మధ్య కోపానికి టైం ఉండదు అంటూ చెప్పుకొచ్చింది. అలా.. వాళ్ళిద్దరి మధ్యన గొడవలు జరుగుతున్నాయి అంటూ వచ్చిన రూమర్లకు క్లియర్ కట్ క్లారిటీతో చెక్ పెట్టింది రష్మీ.