టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్‌లో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతిల జంట కూడా ఒకటి. నేటితో వీరిద్దరి వివాహమై 14 ఏళ్ళు పూర్తయింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేస్తూ తెగ మురిసిపోతున్నారు అభిమానులు. వీళ్ళిద్దరి జంట చూడమచ్చటగా ఉంటుందని.. ఈ 14 ఏళ్లలో వీరి బంధం మరింత బలపడిందని.. ఎప్పటికీ ఈ జంట ఇలాగే ఉండాలంటూ రకరకాలుగా విషెస్ తెలియజేస్తున్నారు ఫ్యాన్స్. ఇక అసలు మేటర్ ఏంటంటే.. తారక్, ప్రణతి వివాహ సమయంలో ఎన్నో ట్విస్టులు చోటు చేసుకున్నాయి. వీరిద్దరి పెళ్లి సమయానికి ప్రణతి మైనర్ అంటూ వివాదం అప్పట్లో తెగ వైరల్‌గా మారింది. అయితే.. ప్రణతికి 18 సంవత్సరాలు నిండిన తర్వాతే తారక్ ఈమెను వివాహం చేసుకున్నాడు.
తారక్, ప్రణతిల పెళ్లి వేడుకకు రికార్డ్ స్థాయిలో అభిమానులు హాజరై సందడి చేశారు. పెళ్లి టైంలో ప్రణతి ధరించిన చీర ఖరీదు ఏకంగా కోటి రూపాయలు కావడం విశేషం. అప్పట్లో ప్రణతి చీర సోషల్ మీడియాలో హాట్ టాపిక్. ఇక ఈ జంట పెళ్లి వేడుకను చూసేందుకు 3000 మంది అతిధులు, స్నేహితులు హాజరు కాగా.. 12,000 మంది అభిమానులు హాజరై సందడి చేశారు. ఇక తారక్.. తనతో పాటు తన కుటుంబ సభ్యులను ప్రేమగా చూసే భార్య కావాలని.. ఎంతగానో కోరుకునే వారట. దానికి ప్రతిరూపంగా ప్రణతి మారిందట. ఇక ఎన్టీఆర్ కు పెళ్లి తర్వాత కెరీర్ పరంగా మరింత కలిసి వచ్చి ఎన్నో బ్లాక్‌బస్టర్ హీట్‌లు అందుకున్న సంగతి తెలిసిందే.
ఇక వీళ్ళ పెళ్లి వేడుకలో పెట్టిన వంటకాలు సైతం అప్పట్లో హాట్ టాపిక్. ఇక వీరిద్దరి పెళ్లి తర్వాత మాత్రం ఓ విషయంలో చాలా హర్ట్ అయ్యాడట తారక్. ఇక పెళ్లయిన తర్వాత ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంటకు ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. కాగా పలు సందర్భాల్లో ఎన్టీఆర్.. తనకు ఓ పాప కూడా పుట్టి ఉంటే బాగుండేదని ఫీల్ అయ్యారు. ఇక ఎన్టీఆర్ తో పాటే లక్ష్మీ ప్రణతిని కూడా ఎంతగానో అభిమానిస్తూ ఉంటారు తారక్ ఫ్యాన్స్. ఈ క్రమంలోనే తారక్ సినిమాల్లో అయినా ప్రణతి కనిపిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక లక్ష్మి ప్రణతికి అలాంటి అవకాశం ఎన్నోసార్లు వచ్చినా.. నో చెప్పేసిందట. ఫ్యూచర్లో ఆయన అభిమానుల కోరికను ప్రణతి నెరవేరుస్తుందో లేదో చూడాలి.