టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని హీరోగా, నిర్మాతగా సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా నాని నుంచి వచ్చిన మూవీ హిట్ 3. ఈ సినిమా ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. హిట్ ఫ్రాంచైజ్‌లో భాగంగా రూపొందిన ఈ సినిమా.. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా.. మోస్ట్ వైలెంట్ గా రూపొంది ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. సినిమాకు దర్శకుడుగా వ్యవహరించిన శైలేష్ కొలను.. నానితో స్క్రీన్ పై బ్లడ్ బాత్ చూపించాడు. రిలీజ్‌కు ముందే ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా.. అంచనాలను అందుకుంటూ రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు కొల్లగొడుతుంది.
ఈ క్రమంలోనే మొదటి రోజు ఏకంగా రూ.40 కోట్ల గ్రాస్వసూళ్లు కొల్లగొట్టిన ఈ సినిమా.. నాని కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ సినిమాగా నిలిచింది. అయితే ఈ సినిమా నాలుగవ రోజు ఏకంగా రూ.101 కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది. యూనిట్ దీన్ని అఫీషియల్ గా ప్రకటించారు. దీంతో పాటే.. మరో గుడ్ న్యూస్ ఏంటంటే.. ఇప్పటికే అన్ని చోట్ల ఈ సినిమా బ్రేక్ ఈవెన్ రీచ్ అయిపోయిందట.
ఈ క్రమంలోనే ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే.. దాదాపు రూ.80 కోట్ల గ్రాస్వసూళ్లు రాబట్టాలి. అలాంటిది.. రూ.101 కోట్లకు పైగా వసూళ్లు రావడంతో.. హిట్ 3 ప్రాఫిట్స్ లో నడుస్తోంది. అంతేకాదు.. మరొపక్క అమెరికాలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికి రెండు మిలియన్ డాలర్లు దాటేసింది. ఇక ఇప్పుడిప్పుడే.. ఈ సినిమా జోరు కాస్త తగ్గుతున్న క్రమంలో.. సినిమా నాలుగవ రోజు కలెక్షన్స్ రూ.100 కోట్ల క్లబ్లో చేరడం ఫ్యాన్స్ కు ఆనందాన్ని కలిగిస్తున్నాయి.