టాలీవుడ్లో అక్కినేని ఫ్యామిలీకి ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అక్కినేని నాగార్జున భార్య అమల కూడా ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా దూసుకుపోయిన సంగతి తెలిసిందే. నాగార్జునతో పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసిన అమల.. చాలా కాలం గ్యాప్ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి అడపా దడపా సినిమాలలో కీలక పాత్రలో నటించింది. ఈ క్రమంలోనే అమలతో గతంలో విజయ్ దేవరకొండ అక్కినేని అమలతో.. విజయ్ దేవరకొండ గతంలో సినిమా ఛాన్స్ ని వదులుకున్నాడంటూ టాక్ వైరల్ అవుతుంది. అయితే.. ఈ సినిమాను విజయ్ దేవరకొండనే రిజెక్ట్ చేశాడట. ఇంతకీ అమలతో విజయ్ రిజెక్ట్ చేసిన ఆ సినిమా ఏంటో.. ఎందుకు రిజెక్ట్ చేశారు ఒకసారి చూద్దాం. విజయ్ దేవరకొండ హీరోగా.. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో వస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్డమ్.
ఈ నెల 30న గ్రాండ్ లెవెల్ వస్తున్న ఈ సినిమే ప్రమోషన్స్ ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగానే ఎన్నో ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంటున్నాడు. అలా తాజాగా ఓ ఇంటర్వ్యూలో విజయ్ మాట్లాడుతూ ఒకే ఒక్క జీవితం మూవీలో మొదట హీరోగా నేనే సెలెక్ట్ అయ్యానని.. కానీ కొన్ని కారణాలతో ఆ సినిమాను రిజెక్ట్ చేసానంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమా కథని శ్రీ కార్తీక్ దగ్గర నేను మూడుసార్లు విన్నా. స్టోరీ నాకు బాగా నచ్చేసింది. నేను ప్రొడ్యూసర్ గా చేద్దామనుకుని కూడా బాడీ లాంగ్వేజ్ సెట్ కాదనే ఉద్దేశంతో ఆగిపోయా. నేను ఈ కథను రిజెక్ట్ చేసిన తర్వాత శర్వానందుకు స్టోరీ చెప్పారు. అలా ఒకే ఒక్క జీవితం సినిమాల్లో హీరో ఛాన్స్ ని నేను వదులుకున్నాను అంటూ విజయ్ దేవరకొండ పేర్కొన్నాడు.
ఇక కింగ్డమ్ మూవీ పై మాట్లాడుతూ ఈ సినిమా ఫ్రాంచైజ్ కాదని.. ఒకవేళ ఈ సినిమా నచ్చి, ఆడియన్స్ మెచ్చితే.. మంచి రెస్పాన్స్ వస్తే ఖచ్చితంగా ఈ సినిమాకు ఫ్రాంచైజ్ తీసుకొచ్చే ప్లాన్ చేస్తాం. అందుకే ఈ సినిమాకి కింగ్డమ్ వన్ అనే టైటిల్ పెట్టలేదు అంటూ విజయ్ దేవరకొండ వెల్లడించాడు. ఇక శర్వానంద్ హీరోగా నటించిన ఒకే ఒక జీవితం మూవీలో అమల.. సర్వనంద్ తల్లి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సైన్స్ ఫిక్షన్ మెలోడీ డ్రామా బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది. ఇక సినిమాల్లో అమ్మ గురించి వచ్చే సాంగ్స్ హైలైట్ గా నిలిచాయి.