తారక్, బన్నీ రిజెక్ట్ చేసిన కథతో బ్లాక్ బస్టర్ కొట్టిన రవితేజ..!

ఇండస్ట్రీలో మొదట ఓ హీరోను అనుకుని.. తర్వాత మరో హీరోతో సినిమాను తెరకెక్కించడం చాలా కామన్. అలా తెర‌కెక్కిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ సక్సెస్‌గా నిలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి సినిమాల్లో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే మూవీ కూడా ఒకటి. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే మాస్ మహారాజ్‌గా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న రవితేజ.. ఇప్పటివరకు ఎన్నో బ్లాక్బస్టర్ సక్సెస్లు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రవితేజ నటించిన ఓ బ్లాక్ బస్టర్ సినిమాను టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రిజ‌క్ట్ చేశారంటూ టాక్ వైర‌ల్‌గా మారుతుంది.Boyapati Srinu: Movies, Photos, Videos, News, Biography & Birthday | Times  of India

ఇంతకీ ఈ ఇద్దరు స్టార్ హీరోస్ రిజెక్ట్ చేసిన ఆ సినిమా ఏంటో.. రిజెక్ట్ చేయడానికి కారణాలేంటి ఒకసారి చూద్దాం. గతంలో రవితేజ బోయపాటి శ్రీను కాంబోలో భద్ర సినిమా తెర‌కెక్కి ఎలాంటి బ్లాక్ బాస్టర్ అందుకుందో తెలిసింది. మీరా జాస్మిన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు డిఎస్పి సంగీతం అందించారు. దిల్ రాజు ప్రొడ్యూస‌ర్‌గా వ్యవహరించాడు. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలవడంతో లాభాల వర్షం కురిసింది. అయితే మొదట బోయపాటి సినిమా కోసం రవితేజ కాకుండా జూనియర్ ఎన్టీఆర్‌ను అనుకున్నారట.Prime Video: Bhadra

ఇందులో భాగంగానే ఆయనకు కథలు కూడా వినిపించాడ‌ట‌. స్టోరీ నచ్చకపోవడంతో ఆయన ఈ కథని రిజెక్ట్ చేశారు. తర్వాత ఇదే స్టోరీని అల్లు అర్జున్ కు బోయపాటి వివరించాడు. ఆయన కథ బాగానే ఉన్నా అప్పటికే ఆర్య మూవీ కి కమిట్ అవ్వడంతో సినిమా చేయలేకపోయాడు. దీంతో బోయపాటి.. రవితేజను సంప్రదించడం ఆయన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నటించడం వెంటవెంటనే జరిగిపోయాయి. ఇక ఈ సినిమా రవితేజ కెరీర్ లోనే ఎవరు గ్రీన్ బ్లాక్ బస్టర్ గా నిలిచిందనడంలో అతిశయోక్తి లేదు.