‘ మహాభారతం ‘ పై రాజమౌళి బిగ్ అప్డేట్.. ఆ హీరో కన్ఫామ్.. !

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పై రాజమౌళి ఎన్నోసార్లు ఆసక్తికరమైన కామెంట్స్ చేస్తూ వచ్చారు. సాధారణంగా రాజమౌళి నుంచి ఓ సినిమా వస్తుందంటేనే ఆడియన్స్ లో పీక్స్ అంచనాలు ఉంటాయి. అలాంటిది రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే ప్రాణం పెట్టి పనిచేస్తారు అనడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే.. రాజమౌళి.. మహాభారతం సెట్స్‌ పైకి రాకముందే ఆడియన్స్ లో ఆసక్తి నెలకొంది. ఎప్పుడెప్పుడు ఆ ప్రాజెక్ట్ సెట్స్‌ పైకి వస్తుందా అంటూ ఫ్యాన్స్ ఎప్పటినుంచో వేచి చూస్తున్నారు.

Natural Star Nani & S. S. Rajamouli Funny Interaction at #HIT3 - Sarkaar's Pre-Release Party - YouTube

ఇలాంటి క్రమంలో తాజాగా రాజమౌళి సినిమాపై పిక్స్ అప్డేట్ ను ఆడియన్స్‌తో షేర్ చేసుకున్నాడు. నాచురల్ స్టార్ నాని, శైలేష్‌ కాంబోలో రూపొందిన తాజా మూవీ హిట్ 3. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో సందడి చేసిన‌ జక్కన్న.. కొద్ది గంటల క్రితం హైదరాబాద్‌లో నిర్వహించిన ఈవెంట్లో మహాభారతం ప్రాజెక్ట్‌పై ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. ఈవెంట్‌కు హోస్ట్‌గా వ్యవహరించిన సుమా.. మహాభారతం అప్డేట్ ఇవ్వమని రిక్వ‌స్ట్ చేయ‌డం.. ఈ ప్రాజెక్టులో నాని ఉంటాడా అంటూ ప్రశ్నించడంతో దీనిపై రాజమౌళి రియాక్ట్ అవుతూ.. నానికి మంచి క్యారెక్టర్ ఉంది. తప్పకుండా మహాభారతంలో నాని ఉంటాడంటూ కన్ఫామ్ చేసేసాడు.

Natural Star Actor Nani from #HIT3 promotions in Chennai 🤩 The shirt is a gift from fans with the text - 'Love from Tamil Nadu' - written in Tamil ❤️ The acceptance

దీంతో.. నాని ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. శైలేష్ కొల‌ను తెర‌కెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌లో నాని.. అర్జున్ సర్కార్ పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. నాని స‌ర‌స‌న‌ కేజిఎఫ్ బ్యూటీ.. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా మెరవ‌నుంది. అలాగే.. రావు రమేష్, బ్రహ్మాజీ ,మాగంటి శ్రీనాథ్, అదిల్ పాల్ తదితరులు కీలక పాత్రలో క‌న‌ప‌డ‌నున్నారు. మీక్కీ. జే. మేయర్ సంగీతం అందించిన ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా.. ఇటీవల రిలీజైన టీజర్, ట్రైలర్ ఆడియోస్లో మంచి రెస్పాన్స్ ని ద‌క్కించుకున్నాయి. ఇక ఈ సినిమా మే డే సంద‌ర్భంగా.. మే 1న గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.