చిరు – అనిల్ కాంబో.. నయన్ డిమాండ్ కు మేకర్స్ మైండ్ బ్లాక్..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మెగా 157 రన్నింగ్ టైటిల్‌తో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి హైప్‌ నెలకొంది. ఇక చివరిగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన అనిల్.. ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే వింటేజ్‌ చిరుని ఆడియన్స్‌కు చూపిస్తూ ఎంటర్టైన్ చేస్తానని అనిల్ ప్రామిస్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చిరంజీవి చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ఫుల్ లెన్త్ కామెడీ రోల్ లో కనిపించనున్నాడని టాక్. దీంతో సినిమాపై ఆడియన్స్‌లో విపరీతమైన హైప్‌ నెలకొంది.

Chiranjeevi Promises Fans an Explosive Ride with Anil's Movie! |  Chiranjeevi Promises Fans an Explosive Ride with Anil's Movie!

ఇలాంటి క్రమంలో సినిమా హీరోయిన్ పాత్ర కోసం చర్చలు జరుగుతున్నాయని సమాచారం. మొదట ఈ సినిమాకు ఐశ్వర్య రాజేష్‌ను హీరోయిన్‌గా తీసుకోవాలని అనిల్ భావించాడంటూ రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి. కానీ.. అవన్నీ ఫేక్ అని తేలిపోయింది. ఇప్పుడు చిరంజీవి పక్క.. సినిమాలో నయనతార హీరోయిన్గా పర్ఫెక్ట్ గా ఉంటుందని.. అనిల్ భావిస్తున్నాడట. దీంతో ఆమెను మేకర్స్ సంప్రదించారని ఇండస్ట్రీలో టాక్ వైరల్ గా మారుతుంది. అయితే.. సినిమా కోసం నయనతారను అప్రోచ్ అయినా మేకర్స్‌కు బిగ్ షాక్ ఇచ్చిందట ఈ ముద్దుగుమ్మ.

Nayanthara's Quote Shocks Mega - Anil Team - Telugu360

చిరు సినిమా కోసం నయన్ ఏకంగా రూ.18 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందని.. ఓటీటీ ప్లేయర్ రిపోర్ట్ వెల్లడించింది. అంతేకాదు.. మూవీ యూనిట్ వర్గాల ద్వారా ఈ స‌మాచారం తెలిసినట్లు టాక్. నయనతార డిమాండ్ విన్న మేకర్స్‌ మైండ్ బ్లాక్ అయిందని.. ఈ క్రమంలోనే వాళ్లు సినిమాలో నయనతారను ఉంచుకోవడానికి ఆమె అడిగిన మొత్తాన్ని ఇవ్వడానికి సిద్ధంగా లేరని తెలుస్తుంది. అంతేకాదు.. ఈ సినిమా కోసం నయన్‌ కాకపోతే.. మరో హీరోయిన్ లైన్లో ఉంచుకున్నారట టీం. ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ నటి పరిమితి చోప్రా అని టాక్ వినిపిస్తుంది. మరి ఈ సినిమాకు హీరోయిన్‌గా చివరకు ఎవరు ఫిక్స్ అవుతారో వేచి చూడాలి. ఇక ఈ సినిమాతో చిరంజీవికి.. అనిల్ ఎలాంటి సక్సెస్ ఆస్తాడో.. ఏ రేంజ్‌లో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటాడో వేచి చూడాలి.