టాలీవుడ్ మాన్ ఆఫ్ మాసేస్ ఎన్టీఆర్ చివరిగా నటించిన దేవర భారీ అంచనాల నడుమ రిలీజై బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. తాజాగా జపాన్ వర్షన్‌లోనూ దేవర రిలీజై మంచి ఆదరణ దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లను రాబట్టింది. ఈ క్రమంలోనే దేవర పార్ట్ 2 పై ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. కాగా.. ప్రస్తుతం ఎన్టీఆర్ బాలీవుడ్ వార్ 2 సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో డ్రాగన్ సినిమా పనుల్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే.
ఈ రెండు సినిమాల షూట్ పూర్తి అయ్యి.. సినిమాలు రిలీజ్ అయిన తర్వాత దేవర 2 ఉంటుందని అంతా భావించారు. కానీ.. వార్ 2, డ్రాగన్ సినిమాలు అవకుండానే దేవర 2 పై కొరటాల బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. దేవర పార్ట్ 2 స్క్రిప్ట్ పై లేటెస్ట్ అప్డేట్ వైరల్ గా మారుతుంది. పరిటాల ఇప్పటికే సినిమా స్క్రిప్ట్‌ని పూర్తి చేసేసినట్లు సమాచారం. ఈ క్రమంలోలనే ఇప్పటికే విఎఫ్ఎక్స్ పనులుకూడా మొదలుపెట్టి బిజీగా గడుపుతున్నట్లు సమాచారం. విఎఫ్ఎక్స్ ను మరింత ఆసక్తికరంగా మలిచేందుకు డైరెక్టర్ కొరటాల శివ కూడా చాలా కష్టపడుతున్నారని.. టీంతో కలిసి శరవేగంగా పనులు పూర్తి చేస్తున్నట్లు సమాచారం.
పాన్ ఇండియన్ వైడ్‌గా కొన్ని కొత్త ఎలిమెంట్లను యాడ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. సినిమా షూటింగ్ అప్డేట్ కూడా నెటింట వైరల్‌గా మారుతుంది. దాదాపు ఈ ఏడాది నవంబర్ నుంచి దేవర పార్ట్ 2 షూటింగ్ ప్రారంభమవుతుందని సమాచారం. ప్రస్తుతం దేవర 2 కి సంబంధించిన ఈ అప్డేట్స్ నెటింట వైరల్ అవ్వడంతో ఫ్యాన్స్ ఆనందాని వ్యక్తం చేస్తున్నారు. తారక్.. వరుస సినిమాలతో ఇలాగే బిజీగా ఉండాలని.. ఫ్యూచర్‌లో మరిన్ని సక్సెస్‌లు అందుకుని మార్కెట్ మరింతగా పెంచుకోవాలంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.