ఆ సీనియర్ బ్యూటీ ఖాతాలో ప్రతినెల రూ.15 వేలు జమ చేస్తున్న పూరీ.. కారణం అదేనా..?

టాలీవుడ్ డేరింగ్ అండ్ డ్యాషింగ్‌ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌కు తెలుగు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుత పాన్ ఇండియన్ స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న టాలీవుడ్ హీరోల అందరికీ బ్లాక్ బస్టర్లు అందించిన పూరి.. ఒకప్పుడు తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోయారు. అయితే ప్రస్తుతం ఫామ్ లో లేకున్నా.. పూరి జగన్నాథ్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం కాస్త కూడా తగ్గలేదు. ఇలాంటి క్రమంలో తాజాగా పూరి కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్‌గా మారుతుంది. ఆయన చాలా కాలంగా ఓ సీనియర్ నటి ఖాతాలో ప్రతినెల రూ.15 వేలు జ‌మ చేస్తున్నాడ‌ట.

Rama Prabha Biography: Age, Career, Family, Husband, Movies, Photos, Divorce

ఇంతకీ ఆ సీనియర్ బ్యూటీ ఎవరు.. ఎందుకు ఆమె ఖాతాలో రూ.15వేలు జమ చేస్తున్నారు.. ఒకసారి తెలుసుకుందాం. ఆ సీనియర్ నటి మరెవరో కాదు రమాప్రభ. ఎస్.. రమాప్రభ ఖాతాలో ప్రతినెల రూ.15వేలు జమ చేస్తున్నాడట పూరి జగన్నాథ్. అయితే.. అసలు ఆమెకు రూ.15 వేలు వేయడం ఎందుకు.. వీళ్ళిద్దరి మధ్యన రిలేషన్ ఏంటి అనే ప్రశ్నలకు రమాప్రభ ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. నాకు, పూరీకి మధ్య మంచి బాండ్ ఉందని.. ఆయన కృష్ణ గారితో సినిమా మొదలు పెట్టి ఓ షెడ్యూల్ కంప్లీట్ అయ్యాక సినిమా ఆగిపోవడంతో.. చాలా బాధపడ్డాడు.

కానీ.. అప్పుడు నేను ఆయనకు ధైర్యం చెప్పి నువ్వు ఫ్యూచర్లో మంచి డైరెక్టర్ అవుతావని.. ఆయన కొడుకుతోనే సినిమా తీసి ఇండస్ట్రియల్ హిట్ కొట్టొచ్చు.. ఇప్పుడే కృంగిపోకు.. మంచి భవిష్యత్తు ఉందని ధైర్యం చెప్పాను అంటూ వివరించింది రమాప్రభ. అలా త‌ను ఇచ్చిన‌ స్ఫూర్తితోనే పూరి ప్రయత్నించి ఇండస్ట్రీలో ఛాన్స్ ద‌క్కించుకున్న పూరీ.. ఈ పొజిషన్‌కు చేరుకున్నారు. అలా.. రమాప్రభ మాటలు తనని ఎంతగానో ఇన్ఫ్లుయెన్స్ చేశాయని.. తర్వాత తన సినిమాల్లో రమాప్రభ ని పూరి ఎక్కువగా తీసుకోవడం ప్రారంభించారు. ఇక కొద్ది సంవత్సరాలకు రామాప్రభ కష్టాల్లో ఉందని విషయం తెలుసుకున్న ఆయన.. ప్రతినెల ఆమె అకౌంట్ కు రూ.15వేలు వేస్తాడట. అయితే ఈ విషయాన్ని స్వయంగా రమాప్రభ ఓ ఇంటర్వ్యూలో వివరించడం విశేషం.