భార్యకు అనారోగ్యం ఉంటే భర్తలు వదిలేస్తారు.. సమంత షాకింగ్ రియాక్ష‌న్‌..!

స్టార్ హీరొయిన్ గా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న సమంత.. ఇప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు తన ఆరోగ్యానికి, వెకేషన్ లకు, సినిమాలకు సంబంధించిన అప్డేట్లను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకునే ఈ ముద్దుగుమ్మ.. 2022లో మయోసైటీస్‌తో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అదే సమయంలో ఆరోగ్యనికి సంబంధించిన అప్డేట్లను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉండేది. అయితే తాజాగా ఇన్‌స్టా వేదికగా.. వివాహబంధం విచ్ఛిన్నం కావడంపై కారణాలు తెలుపుతూ వచ్చిన షాకింగ్ పోస్టుకు ఆమె లైక్ కొట్టడం హాట్ టాపిక్ గా మారింది. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న భార్యలను వదిలించుకోవడానికి భర్తలు ఇష్టపడతారని.. ఒక సర్వే గురించి ఆ పోస్ట్‌లో క్లియర్‌గా వెల్లడించారు. దానికి సమంత లైక్ కొట్టడం మరింత హాట్ టాపిక్ గా మారింది.

Samantha Ruth Prabhu | How Much Samantha Ruth Prabhu Spending on myositis treatment dgtl - Anandabazar

ఇన్స్టా.. సక్సెస్ వెర్స్ ఎకౌంట్లో తాజాగా ఓ పోస్ట్ ని షేర్ చేశారు. అందులో ఎక్కువగా హెల్త్, కుటుంబ ఆనందాలను గురించి పోస్ట్లు షేర్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఓ సర్వే గురించి మాట్లాడుతూ.. కుటుంబంలో భార్య తీవ్ర అనారోగ్యానికి గురైతే భర్త ఆమెను వదిలించుకోవడానికి ఇష్టపడతాడని.. ఒకవేళ భర్త అనారోగ్యానికి గురైతే భార్య‌ మాత్రం అతన్ని వదిలిపెట్టదు. ఒక సర్వే ద్వారా ఇది నిర్ధారించబడింది అంటూ చెప్పుకోచ్చారు. పురుషులు తమ భాగస్వామికి ప్రాణాంతక అనారోగ్యం వస్తే ఆమెను వదిలించుకోవడానికి ముక్కువ‌ చూపుతారని.. 1000 మందిలో 624 మంది ఇలానే ఉన్నారని గుణంకాలతో సహా సర్వేల వివరించారు.

Naga Chaitanya On His Divorce From Samantha Ruth Prabhu: "Why Am I Treated Like A Criminal?"

ఇక అనారోగ్యం కారణంగా పురుషుడు ఆమెతో.. బాగోద్వేగా, శారీరక సాన్నిహిత్యం కోల్పోవడం భర్తలు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని.. అనారోగ్యం సమయంలో భార్యను వదిలేయడం వెనుక దాగి ఉన్న మరిన్ని విషయాలు నేటి ప్రపంచానికి తెలుపుదాం అని ఆ పోస్టులో ఉంది. సుమారు 60 వేలకు పైగా ఆ పోస్ట్‌కు లైక్‌లు రాగా.. భర్తతో విడిపోయిన సమంత ఇలాంటి పోస్ట్లు లైక్ చేయడం మాత్రం కాస్త ఆశ్చర్యంగా మారింది. 2021లో భర్త నాగచైతన్యతో ఆమె విడాకులు ప్రకటించిన సంగతి తెలిసిందే. 2022లో మయోసైటిస్తో అనారోగ్యానికి గురైనట్లు ఆమె రివీల్‌ చేసింది. దానికి చికిత్స పొందుతూనే ఖుషి, శాకుంతలం సినిమాలను నటించింది. అయితే ప్రస్తుతం ఆమె పూర్తిగా ఆరోగ్యంగానే ఉంది. ఇప్పుడిప్పుడే మళ్ళీ సినిమాలతో బిజీ అవుతుంది. ఈ క్రమంలో సమంత రియాక్షన్ అభిమానులలో కొత్త సందేహాలు మొద‌ల‌య్యాయి.