టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం నేషనల్ లెవెల్లో కాదు ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. జక్కన్న నుంచి ఓ సినిమా వస్తుందంటే చాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఆడియన్స్ అంతా.. ఆ సినిమా కోసం కళ్ళు కాయలు కాచే రేంజ్‌లో రాజమౌళి ఆడియన్స్‌ను మెప్పిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా సక్సెస్ఫుల్ డైరెక్టర్ గాను బిరుదు సంపాదించుకున్నాడు. అలాంటి రాజమౌళి తన కెరీర్లో తెరకెక్కించిన కొన్ని సినిమాలు మొదట మిక్స్డ్ టాక్ ను తెచ్చుకుని.. తర్వాత విజయాలను అందుకున్నాయి. ఇంతకీ ఆ సినిమాల లిస్టు ఏంటో ఒకసారి చూద్దాం.
సై:
నితిన్ హీరోగా.. జెనీలియా హీరోయిన్ గా.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెకెక్కిన సై సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇక మొదట ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలోనే సినిమాకు అనుకున్న రేంజ్ లో ఆదరణ దక్కలేదు. తర్వాత మల్ల మెల్లగా సినిమా పాజిటివ్ టాక్ అందుకుంటూ.. ఓవరాల్గా ఫుల్ రన్ లో మంచి సక్సెస్ అందుకుంది. అయితే కలెక్షన్ల విషయంలో మాత్రం భారీ లాభాలు దక్కించుకోలేదు.
యమదొంగ:
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన యమదొంగ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా మొదట డివైడ్ టాక్ వచ్చింది. నిదానంగా ప్రేక్షకుల్లో ఈ సినిమా కనెక్ట్ అవ్వడంతో పబ్లిసిటీ ద్వారా ఆడియన్స్ సినిమాకు క్యూ కట్టారు. ఈ క్రమంలోనే సూపర్ సక్సెస్ అందుకున్న ఈ సినిమా భారీ కలెక్షన్లను సైతం కొల్లగొట్టింది.
బాహుబలి:
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన తెలుగు సినిమాను పాన్ ఇండియా స్థాయిలో నిలబెట్టిన మొదటి సినిమా. బాహుబలి రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ఊహించిన రేంజ్ లో లాభాలు దక్కించుకోలేకపోయింది. మొదటి సినిమాకు డివైడ్ టాక్ రావడమే కాదు.. రాజమౌళి కూడా విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ సినిమాలో ఎమోషన్స్ లేవని.. ఇలాంటి సినిమాల అసలు ఎలా చేశారంటూ నెగిటివ్ కామెంట్లు వినిపించాయి. కానీ.. మొత్తానికి సినిమా సూపర్ సక్సెస్ అందుకుంది. రూ.600 కోట్ల వరకు కలెక్షన్లను కొల్లగొట్టింది.