ఈ ఏడాది సంక్రాంతి బరిలో ముగ్గురు టాప్ స్టార్ హీరోస్ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. వాటిల్లో రెండు సీనియర్ స్టార్ హీరోలు బాలయ్య, వెంకటేష్ సినిమాలు కాగా.. మరొకటి యంగ్ హీరో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్. దిల్ రాజు ప్రొడ్యూసర్‌గా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి బరిలో మొదటి రిలీజ్ అయింది. జనవరి 10న ఆడియన్స్‌ను పలకరించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక.. ఈ సినిమా తర్వాత రెండే రోజుల గ్యాప్ తో నటసింహం బాలయ్య, బాబి దర్శకత్వంలో డాకు మహారాజ్ జనవరి 12న రిలీజై ఆడియన్స్ను ఆకట్టుకుంది. సరిగా ఈ సినిమాకు రెండు రోజుల గ్యాప్ తర్వాత వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా జనవరి 14న రిలీజై సంక్రాంతి బరిలో నెంబర్ వన్‌గా నిలిచింది. అయితే సంక్రాంతి బరిలో రిలీజై హిట్ కొట్టిన ఈ రెండు సినిమాలు.. వంద రోజులు నిరంతరాయంగా ఆడి సెంచరీలు కొట్టాయాన్ని చాలామందికి తెలిసి ఉండదు.
డాకు మహారాజ్:
జనవరి 12న రిలీజ్ అయిన బాలయ్య డాకు మహారాజ్ మొదటి రెండు రోజులు కలెక్షన్ల వర్షం కురిపించింది. బాలయ్య రొటీన్ యాక్షన్ డ్రామా అని టాక్ వైరల్ కావడంతో.. పండగ తర్వాత డాకు మహారాజ్ పెద్దగా కలెక్షన్లు రాబట్ట లేకపోయింది. కానీ.. కొన్ని మాస్ ఏరియాల్లో బాలయ్య క్రేజ్‌తో సినిమా నిరంతరాయంగా ఆడింది. ఈ క్రమంలోనే.. డాకు మహారాజ్ చిలకలూరిపేటలో 100 డేస్ సక్సెస్ఫుల్గా ఆడింది. ఏప్రిల్ 21న సినిమా రిలీజై.. కచ్చితంగా వంద రోజులు పూర్తయ్యాయి. ఇప్పటికే బాలయ్య నటించిన ఎన్నో సినిమాలు చిలకలూరిపేటలో 100 డేస్ సిల్వర్ జూబ్లీ చూసిన సంగతి తెలిసిందే. ఆ లిస్టు లోకి డాకు మహారాజ్ కూడా చేరిపోయింది.
సంక్రాంతికి వస్తున్నాం:
సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాంకు దిల్ రాజు ప్రొడ్యూసర్గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. కాగా గేమ్ ఛేంజర్ మిగిల్చిన నష్టాలను సంక్రాంతికి వస్తున్నం కొంతమేర గట్టెక్కించింది. ఇక మూవీలో బుల్లిరాజు రోల్ మరింత హైలెట్గా మారింది. ఈ క్రమంలోనే ఆ రోల్ ప్లుఏ చేసిన మాస్టర్ హేమంత్ తిరుగులేని క్రేజ్ దక్కించుకున్నాడు. ఐశ్వర్య రాజేష్ నటన అనిల్ రావిపూడి మార్క్ కామెడీ ఎంటర్టైన్మెంట్ మెప్పించాయి. పొంగల్ బరిలో నెంబర్ వన్ స్టేటస్ అందుకున్న ఈ సినిమా.. నంద్యాల శ్రీరామ థియేటర్లో సరిగ్గా మరో రెండు రోజుల్లో 100 డేస్ ఫుల్ రన్ పూర్తిచేసుకునుంది. అలా ఈ ఏడాది సంక్రాంతి బడిలో రిలీజ్ అయిన రెండు సీనియర్ హీరోల సినిమాలు 100 డేస్ ఫుల్ రన్నింగ్ ముగించడం ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. మరి రాబోయే రోజుల్లో ఇంకా ఏ సినిమాలు 100 డేస్ ఫుల్ రన్ను పూర్తి చేసి సెన్సేషన్ క్రియేట్ చేస్తాయో వేచి చూడాలి.