జాక్ పాట్ కొట్టిన శివాజీ.. ఈసారి ఏకంగా సుకుమార్ తో ఛాన్స్..!

గతంలో హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న శివాజీ.. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను మారి తన నటనతో ప్రశంసలు దక్కించుకున్నాడు. అయితే.. హీరోగా ఎన్ని సక్సెస్‌లు అందుకున్నా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎంత మంచి ఇమేజ్ను దక్కించుకున్నా.. తనకంటూ ఒక స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం లేదని చెప్పాలి. అయితే ఎప్పుడైతే బిగ్ బాస్ 1లో కంటిస్టెంట్గా అడుగుపెట్టాడు అప్పటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ మొదలైంది. తెలుగు ప్రేక్షకులంతా శివన్నకు చేరువఅవ‌డం మొదలుపెట్టారు. ఇప్పటివరకు జరిగిన తెలుగు బిగ్బాస్ సీజన్లు అన్నింటిలో శివాజీ లాంటి మాస్టర్ మైండ్ గేమర్‌ ఎవరు లేరని అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి.

Sivajis One-Man Show As Mangapathi In Court!

ఈ లెవెల్లో క్రేజ్‌ సంపాదించుకున్న శివాజీ.. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తను నటించిన 90 స్ కిడ్స్ వెబ్ సిరీస్‌తో సంచలన సక్సెస్ అందుకున్నాడు. ఇక.. తర్వాత నాచురల్ స్టార్ నాని ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన కోర్ట్ సినిమాలో మంగపతి క్యారెక్టర్ తో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కమర్షియల్ బ్లాక్ బ‌స్టర్ హిట్గా నిలిచింది. దానికి ప్రధాన కారణం శివాజీ రోల్ అనడంలో అతిశయోక్తి లేదు. ఇక సినిమాలో మంగపతి పాత్రలో.. వైల్డ్ షేడ్స్ చూపిస్తూ ఆడియన్స్ను భయపెట్టాడు శివాజీ. ఈ క్రమంలోనే ఆయన పాపులారిటీ మరింతగా పెరిగింది.

Holi 2024: Ram Charan's Big Announcement - Film With Pushpa Director Sukumar

డైరెక్టర్స్ అంతా శివాజీ తో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో మరోసారి శివాజీ జాక్పాట్ ఆఫర్లు కొట్టేసాడని.. అది కూడా టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తో.. ప‌ని చేసే అవకాశం వచ్చిందంటూ న్యూస్ తెగ వైరల్ గా మారుతుంది. సుకుమార్‌.. శివాజీ కలిసి ఉన్న ఫోటో నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది. సుకుమార్.. చ‌రణ్‌తో సినిమాను రూపొందించనున్న‌ సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాల్లో శివాజీ ఓ ప్రధాన పాత్ర‌లో నటించనున్నాడ‌ట‌. వాస్తవం ఎంతో తెలియాదు కానీ.. ఒకవేళ శివాజీని నిజంగానే సినిమాలో తీసుకుంటే మాత్రం అది సినిమాకు ప్ల‌సే అవుతుంది తప్ప.. మైనస్ మాత్రం కాదు అనడంలో అతిశయోక్తి లేదు. ఇక శివాజీ నిజంగానే సినిమాలో ఛాన్స్ కొట్టేస్తే కుంభస్థలం బద్దలు కొట్టినట్టే అవుతుంది.