ఆ హీరోయిన్ తో లిప్ లాక్ సీన్ చేయనని తెగేసి చెప్పిన విజయ్ సేతుపతి.. ఇంతకీ ఆమె ఎవరంటే..?

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో నటీనటులంతా సక్సెస్ఫుల్ స్టార్ సెలబ్రిటీలుగా ఎదగడానికి ఎంతో కష్టపడుతున్నారు. ఎంత కష్టతరమైన పాత్రలోనైనా, ఎలాంటి ఛాలెంజింగ్ రోల్స్ లో అయినా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. పాత్ర కోసం అవసరమైతే హీరోలు లేడీ గెటప్ లు వేసిన సందర్భాలు, హీరోయిన్లు హాఫ్ న్యూడ్ గా కనిపించిన సందర్భాలు, గుండ్లు కొట్టించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక.. రొమాంటిక్ సన్నివేశాల గురించి చెప్పాల్సిన పనిలేదు. కానీ.. అందరు హీరో, హీరోయిన్స్ ఇలానే ఉన్నారా.. అంటే కాదని చెప్పాలి. తమ గౌరవాన్ని కాపాడుకునేందుకు ఇంపార్టెన్స్ ఇస్తూ.. రొమాంటిక్ సన్నివేశాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.

Watch 96 (Tamil) Full Movie Online | Sun NXT

అలాంటివారు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ల‌లో విజయ్‌సేతుపతి కూడా ఒకరు అనడంలో అతిశయోక్తి లేదు. ఆయన కూడా హీరోయిన్ సైతం లిప్ లాక్స్‌కు అంగీకరించిన.. తాను అసలు నటించడానికి నిరాకరిస్తాడట. అలా గతంలో ఆ సన్నివేశం అవసరం పడినా సరే పట్టుబట్టి మరి.. అసలు ఆ సీన్‌ లేకుండా షూటింగ్ పూర్తి చేశాడు. కట్ చేస్తే సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇంతకీ ఆ మూవీ మరేదో కాదు 96. విజయ్‌సేతుపతి, త్రిష జంటగా నటించిన ఈ సినిమా అప్పట్లో ఎలాంటి ఘనవిజయం అందుకుందో తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరో, హీరోయిన్ మద్య‌న లిప్ లాక్ సీన్ ఉంటుందట.

In Pics | 96 Movie: 'காதலே காதலே தனிபெருந்துனையே'96 படத்தை போல் நடந்த  ரீ-யூனியன்-ஓட்டம் பிடித்த முன்னாள் காதலர்கள்!

ఈ సీన్‌ డైరెక్టర్ ముందుగానే వివరించాడట. త్రిష దీనికి ఒప్పుకున్న.. విజయ్ సేతుపతి మాత్రం అస్సలు అంగీకరించలేదు. అయినా క్లైమాక్స్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. ఇద్దరు ఒకరికొకరు వీడ్కోలు పలికే టైం లో ఈ సన్నివేశం ఉండాలని.. దర్శకుడు చెప్పిన నిరాకరించాడట. అయితే లిప్ లాక్ సీన్ లేకపోయినా విమానాశ్రయంలో వీడ్కోలు చెప్పుకోవాల్సిన ఈ క్లైమాక్స్ సీన్.. ఆడియన్స్ లో గుర్తుండిపోయింది. ఇక సినిమాలో త్రిష జాను పాత్రలో మెరిసింది. కాగా.. ఇండస్ట్రీలో విజయ్‌సేతుపతితో పాటే.. లిప్ లాక్ సీన్స్ రిజెక్ట్ చేసే హీరోల లిస్టులో అజిత్, సూర్య, శివ కార్తికేయన్ పేర్లు సైతం వినిపిస్తున్నాయి. ప్రస్తుతం త్రిష, విజయ్ సేతుప‌తి ఇద్దరు వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే.