ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీ లెక్కలు మారిపోయాయి. పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ ఊపు అందుకుంది. ఈ క్రమంలోనే హీరోలు కూడా పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ లో అందుకుంటున్నారు. ఇప్పుడు భాషతో సంబంధం లేకుండా ఇండియా వైడ్‌గా పోటీ ప్రారంభమైంది. తెలుగు హీరోలు గొప్ప అంటే.. తమిళ హీరోలే గొప్ప అంటూ.. కాదు హిందీ హీరోలే గొప్ప అంటూ.. వివాదాలు మొదలయ్యాయి. ఇలాంటి క్రమంలోనే ఇండియన్ పాపులర్ యాక్టర్స్ కు సంబంధించిన పోటీ నెలకొంది. ఇందులో ఎవరు ఎక్కువ క్రేజ్ ఉంది అనేది హాట్ టాపిక్గా మారింది. ఇలాంటి క్రమంలో ప్రముఖ మీడియా సంస్థ ఓర్మాక్స్ మీడియా దీనికి సంబంధించిన లిస్ట్ ప్రకటించింది.
తమ ఛానల్‌కు సంబంధించిన లిస్టును రిలీజ్ చేసింది. ఈ క్రమంలోనే.. ఇండియన్ మోస్ట్ పాపులర్ టాప్ 10 హీరోల జాబితాను ప్రకటించింది. అయితే.. అల్లు అర్జున్ పుష్ప 2తో సాలిడ్ సక్సెస్ అందుకున్న క్రమంలో టాప్ 10లో నెంబర్ వన్ పొజిషన్‌ను దక్కించుకుంటారని అంతా అనుకున్నారు. కానీ.. ఆయనకు మూడో స్థానం దక్కింది. కాగా మొదటి స్థానం మరోసారి ప్రభాస్ సొంతం చేసుకున్నారు. గత రెండు నెలలుగా ప్రభాస్ నెంబర్ వన్‌గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మార్చ్ నెలలోనూ ఇదే కంటిన్యూ అవుతూ వస్తుంది. ఇటీవల ప్రభాస్ సినిమాలకు ఎలాంటి అప్డేట్స్ రాకున్న ఫస్ట్ ప్లేస్ లో ప్రభాస్ ఉండటం విశేషం.
ఇక రెండో స్థానంలో కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి, మూడో స్థానంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, 4వ స్థానంలో షారుక్, 5వ స్థానంలో సూపర్ స్టార్ మహేష్చ 6వ స్థానంలో అజిత్, 7వ స్థానంలో ఎన్టీఆర్, 8వ స్థానంలో చరణ్ చోటు దక్కించుకున్నారు. 9వ స్థానంలో సల్మాన్ ఖాన్, 10వ స్థానంలో అక్షయ్ కుమార్ నిలిచారు. అలా టాలీవుడ్ టాప్ 10 స్టార్ హీరోల్లో.. టాలీవుడ్ హీరోలే అయిదుగురు ఉండడం విశేషం. కోలీవుడ్, హిందీ ఇండస్ట్రీలలో కలిపి ఐదుగురు హీరోలు ఉన్నారు. ఎలా ఇండియన్ లెవెల్ టాప్ 10 హీరోల లిస్ట్ లోను తెలుగు హీరోల హవా నడుస్తుంది. కాగా.. ప్రస్తుతం ఈ లిస్ట్‌లో నెంబర్ వన్‌గా ప్రభాస్ రావడంతో.. ప్రభాస్ ఫ్యాన్స్ ఐ కాన్ స్టార్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్న.. ప్రభాస్ నెంబర్ వన్ పొజిషన్ను మాత్రం టచ్ కూడా చేయలేకపోయాడంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.