బన్నీ పాన్ వరల్డ్ రేంజ్ మల్టీ స్టారర్.. ఫ్యాన్స్ కలలో కూడా ఊహించని కాంబో..!

టాలీవుడ్ ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్.. పుష్ప 2తో సాలిడ్స్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో తాజాగా బన్నీకి సంబంధించిన ఓ గూస్ బంప్స్ అప్డేట్ నెటింట‌ వైరల్‌గా మారుతుంది. దీంతో.. బన్నీ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక కేవలం ఆయన అభిమానులకే కాదు.. సినీ ప్రేక్షకుల సైతం మంచి అంచనాలను నెలకొల్పుతూ ఆడియన్స్‌లో హైప్‌ను తెచ్చిపెడుతుంది. ప్రస్తుతం మల్టీస్టారర్‌ ట్రెండ్ కొనసాగుతున్న క్ర‌మంలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకొని.. బడ బడా పాన్ ఇండియన్ స్టార్లుగా దోసుకుపోతున్న హీరోలు సైతం మల్టీస్టారర్ సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు.

Rashmika Mandanna says Ranbir Kapoor does not like nonsense: 'With Allu  Arjun sir, our energies match' | Hindi Movie News - The Times of India

ఇలాంటి క్రమంలో.. పుష్ప 2 లాంటి సాలిడ్ సక్సెస్‌తో ఉన్న బన్నీ.. మైండ్ బ్లోయింగ్ డెసిషన్ తీసుకున్నారట. తన కెరీర్‌లోనే మొట్టమొదటిసారి బిగ్గెస్ట్ మల్టీ స్టార‌ర్ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అది కూడా పుష్ప ఫ్రాంచైజ్ సినిమా లాగే రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం అంటూ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక పుష్ప సినిమా తర్వాత బన్నీ రేంజ్ ఎంతకు ఎదిగిందో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు పుష్ప క్రేజ్ ను కూడా తలదన్నే రేంజ్ లో ఈ మల్టీ స్టారర్ సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అదికూడా బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ్‌బీర్ కపూర్, అల్లు అర్జున్ కాంబోలో రూపొందనుందట.

Allu Arjun opens up about the idea of working with Ranbir Kapoor: 'Across  Bollywood, he is one of the finest actors' | - Times of India

అంతేకాదు ఈ సినిమాకు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భ‌న్సాలీ ద‌ర్శ‌క‌త్వం వహించనున్నాడని న్యూస్ ఇప్పుడు బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలో మారుమోగిపోతుంది. ఈ క్రమంలోనే బన్నీ ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్ ప్రస్తుతం.. నేషనల్ లెవెల్‌లో స్టార్ హీరో ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. ఇక రణ్‌బీర్ కపూర్ కూడా బాలీవుడ్తో పాటు పాన్ ఇండియా లెవెల్‌లో సత్తా చాటుతున్నాడు. అలాంటి ఇద్దరు టాప్ స్టార్ హీరోస్ కలిసి ఓ ప్రాజెక్టులో నటిస్తే ఆ అది కూడా సంజయ్ లీలా భ‌న్సాలీ  డైరెక్షన్‌లో అంటే.. కచ్చితంగా మూవీ బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ వార్తలో వాస్తవం ఎంతో తెలియదు కానీ.. ఇదే నిజమైతే మాత్రం పుష్ప 2కు తర్వాత.. మరోసారి బన్నీ సాలిడ్ హిట్ కొట్టడం ఖాయం అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.